ప్రభాస్ 'సలార్' మూవీ గ్రాండ్ లాంఛ్
మరో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇదివరకే సలార్ అనే సినిమాను ప్రకటించిన ఈ హీరో.. ఆ సినిమాను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి కేజీఎఫ్ హీరో యష్ చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రభాస్-యష్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళిని కూడా ఆహ్వానించారు. కానీ ఎందుకో ఆయన రాలేదు. తాజాగా […]
మరో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇదివరకే సలార్ అనే సినిమాను ప్రకటించిన ఈ హీరో.. ఆ సినిమాను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాడు. హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ ప్రారంభోత్సవానికి కేజీఎఫ్ హీరో యష్ చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రభాస్-యష్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళిని కూడా ఆహ్వానించారు. కానీ ఎందుకో ఆయన రాలేదు.
తాజాగా రాధేశ్యామ్ సినిమాను పూర్తిచేశాడు ప్రభాస్. ఫిబ్రవరి నుంచి సలార్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. దీంతో పాటు ఆదిపురుష్ మూవీని కూడా పట్టాలపైకి తీసుకొస్తాడు. సలార్ లో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంను విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు.