Telugu Global
NEWS

ఏడాదిలో చంద్రబాబు ఎంతలా మారారంటే..?

2020 సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అమరావతి రైతులకు పండగ కూడా దూరం చేశారంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అక్కడితో ఆగకుండా కుటుంబంతో సహా అమరావతి దీక్షా శిబిరాలకు చేరుకున్నారు. అమరావతి రైతులతో కలసి నిరసన కార్యక్రమాలతోనే పండగ జరుపుకున్నారు. వాస్తవానికి అప్పటి వరకూ ఆందోళన చేస్తున్నా.. పండగ సందర్భంగా ఎవరి ఇళ్లకు వారు వెళ్లి పిండి వంటలు చేసుకుని సరదాగా గడుపుదామనుకున్నారు అమరావతి రైతులు. కానీ చంద్రబాబు వారందర్నీ దీక్షా […]

2020 సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అమరావతి రైతులకు పండగ కూడా దూరం చేశారంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అక్కడితో ఆగకుండా కుటుంబంతో సహా అమరావతి దీక్షా శిబిరాలకు చేరుకున్నారు. అమరావతి రైతులతో కలసి నిరసన కార్యక్రమాలతోనే పండగ జరుపుకున్నారు. వాస్తవానికి అప్పటి వరకూ ఆందోళన చేస్తున్నా.. పండగ సందర్భంగా ఎవరి ఇళ్లకు వారు వెళ్లి పిండి వంటలు చేసుకుని సరదాగా గడుపుదామనుకున్నారు అమరావతి రైతులు. కానీ చంద్రబాబు వారందర్నీ దీక్షా శిబిరాల వద్దే లాక్ చేశారని, అలా వారిని పండగకు దూరం చేసింది బాబు కానీ, జగన్ కాదు అని సోషల్ మీడియాలో సెటైర్లు బాగానే పడ్డాయి. ఆ తర్వాతే బాబు బంగారు గాజుల ఉద్యమం మొదలు పెట్టారు, ఊరూవాడా జోలె పట్టారు. కట్ చేస్తే.. కరోనా సాకుతో ఆ ఉద్యమం అటకెక్కింది, బాబు సతీమణి బంగారు గాజుల బోణీ బాగోలేదని తెేలింది.

ఈ ఏడాది చంద్రబాబు సంక్రాంతి..
ఇక 2021 సంక్రాంతి. అమరావతి ఉద్యమంలో మార్పేమీ లేదు, కేవలం రోజులు పెరుగుతున్నాయంతే. గతేడాది పండగరోజు ఉన్న టెంట్లే ఈ ఏడాది కూడా ఉన్నాయి. కానీ అక్కడ చంద్రబాబు మాయమయ్యారంతే. పండగ జరుపుకోనీయరా అంటూ గతేడాది అమరావతి రైతులకు వత్తాసు పలికిన బాబు.. ఈ ఏడాది పండగకోసం అమరావతి వెళ్లలేదు. కృష్ణాజిల్లా పరిటాలలో టీడీపీ నేతలతో కలసి హడావిడి చేశారు. రైతులకు వ్యతిరేకంగా జీవోలిచ్చారంటూ.. పేపర్లను మంటల్లో వేసి తగలబెట్టారు. అసలింతకీ అమరావతి రైతులు బాబుకి ఎందుకు గుర్తులేరు? బాబు మాటల ప్రకారం మూడు రాజధానుల విషయంలో ఏమీ మార్పు లేదు కాబట్టి, ఈ సంక్రాంతికి కూడా అక్కడి రైతులకు పండగ లేనట్టే లెక్క. మరి అలాంటి రైతుల్ని అర్థాంతరంగా చంద్రబాబు ఎందుకు వదిలేసి వచ్చినట్టు. రైతులంటే కేవలం అమరావతి రైతులేనంటూ రెచ్చిపోయిన ఆయన.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రైతులపై ప్రేమాభిమానాలు కురిపించడంలో మతలబేంటి..?

అమరావతిని పూర్తిగా అటకెక్కించేసిన బాబు..
రోజులు గడిచేకొద్దీ అమరావతికి చంద్రబాబు అడుగులు దూరంగా పడుతున్నాయి. ఈ విషయం అమరావతి రైతులకు కూడా అర్థమవుతుందనుకున్న టైమ్ లో హడావిడిగా అక్కడ ఓ అడుగు పెట్టేసి మాయమైపోతుంటారు బాబు. అమరావతికే పరిమితం అయితే లాభం లేదని గ్రహించే.. సందర్భానికి తగ్గట్టు ఆలయాలు, విగ్రహాలు, అధికార పక్షం దాడులు అంటూ తన విన్యాసాలు చూపిస్తున్నారు.
గతేడాది అమరావతి రైతుల దగ్గర పండగ జరుపుకున్న బాబు, ఈ ఏడాది అటువైపు కన్నెత్తి కూడా చూడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తనకేమాత్రం రాజకీయ లాభం లేదు అనుకున్నారు కాబట్టే బాబు అమరావతి దీక్షా శిబిరాల వద్దకు వెళ్లలేదు.

First Published:  15 Jan 2021 2:43 AM IST
Next Story