Telugu Global
International

కరోనా కాలర్ ఆడియో వల్ల కోట్ల గంటలు టైం వేస్ట్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి.. కరోనా వైరస్‌పై పోరాడేందుకు అంటూ ముప్ఫై సెకన్ల ఆడియో వినిపిస్తుంది. మీరు ఎంత వద్దనుకున్నా ఆ టెలీ ఆడియో మాత్రం ఆగదు. అయితే ఈ ఆడియో క్లిప్ వినడం ద్వారా యూజర్లకు సుమారు రోజుకు కోటి నుంచి మూడుకోట్ల గంటల సమయం వృథా అవుతుందట.అంతేకాదు ఈ వాయిస్ మెసేజ్ వల్ల విలువైన బ్యాండ్ విడ్త్ రిసోర్సులు కూడా వృథా అవుతున్నాయట. పైగా ఇది మెసేజ్ అందించడం ఏమో కానీ […]

కరోనా కాలర్ ఆడియో వల్ల కోట్ల గంటలు టైం వేస్ట్
X

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి.. కరోనా వైరస్‌పై పోరాడేందుకు అంటూ ముప్ఫై సెకన్ల ఆడియో వినిపిస్తుంది. మీరు ఎంత వద్దనుకున్నా ఆ టెలీ ఆడియో మాత్రం ఆగదు. అయితే ఈ ఆడియో క్లిప్ వినడం ద్వారా యూజర్లకు సుమారు రోజుకు కోటి నుంచి మూడుకోట్ల గంటల సమయం వృథా అవుతుందట.అంతేకాదు ఈ వాయిస్ మెసేజ్ వల్ల విలువైన బ్యాండ్ విడ్త్ రిసోర్సులు కూడా వృథా అవుతున్నాయట. పైగా ఇది మెసేజ్ అందించడం ఏమో కానీ జనానికి అత్యంత చిరాకు కోపాన్ని తెప్పిస్తుందని టెలికం అథారిటీలు అభిప్రాయపడుతున్నాయి.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ పి డి వాఘేలా మాట్లాడుతూ..’ మహమ్మారికి సంబంధించిన ఆడియో సందేశాలు జనాల ఓపికకు పరిక్ష పెడుతుంది. మొబైల్ వినియోగదారులు దీనిని ఎక్కువగా విస్మరిస్తున్నారు. ఎందుకంటే మాస్క్ ఇంకా డిస్టెన్సింగ్ గురించి ఇప్పటికే జనానికి తెలుసు. ప్రతిసారి చెప్పిందే చెప్తుంటే ప్రజలు విసిగిపోతున్నారు. అదీకాక ఎప్పుడైనా అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను డయల్ చేసినప్పుడు కూడా ఇదే వాయిస్ వస్తూ సమయం వృథా అవ్వడం వల్ల మరింత ఇబ్బందిగా మారుతుంది’ అని అన్నారు.

ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్ ప్రీ-కాల్ ప్రకటన ప్రకారం మొబైల్ నెట్‌వర్క్‌తో కాల్ చేసినప్పుడు ఈ ఆడియో తప్పనిసరిగా ప్లే అవుతుంది. అందుకే ఎప్పుడైనా అత్యవసర కాల్స్ చేసుకోవాలంటే.. యూజర్స్ వాట్సాప్, ఫేస్‌టైమ్ లేదా మెసెంజర్ ద్వారా కాల్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పటికే ఈ సమస్య గురించి టెలికాం నిపుణులు ప్రభుత్వానికి, సెక్టార్ రెగ్యులేటర్‌కు సూచించారు. మరి ఈ ఆడియో మెసేజ్‌ను ఎప్పుడు ఆపేస్తారో చూడాలి.

First Published:  15 Jan 2021 9:45 AM IST
Next Story