రేపే ప్రభాస్ మూవీ ఓపెనింగ్
ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సలార్ సినిమా రేపు గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. కనుమ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంచ్ చేయబోతున్నారు. లాంఛ్ తర్వాత మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది. భారీ ఎత్తున జరగనున్న ఈ కార్యక్రమానికి సలార్ చిత్రయూనిట్ సహా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిష్టర్ అశ్వత్ నారాయణ్ సీఎన్, […]
ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్
దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సలార్ సినిమా రేపు గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. కనుమ
సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంచ్ చేయబోతున్నారు. లాంఛ్ తర్వాత మూవీకి
సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది.
భారీ ఎత్తున జరగనున్న ఈ కార్యక్రమానికి సలార్ చిత్రయూనిట్ సహా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిష్టర్
అశ్వత్ నారాయణ్ సీఎన్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ సహా ఇతర సినీ
ప్రముఖులు హాజరు కానున్నారు.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. ఒకరు పాన్ ఇండియా డైరక్టర్ అయితే,
మరొకరు పాన్ ఇండియా డైరక్టర్. అందుకే ఈ కాంబినేషన్ పై క్రేజ్ మరింత పెరిగింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీని
నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ పాన్-ఇండియా సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతోంది.