సమ్మర్ ఎట్రాక్షన్ గా అఖిల్ మూవీ
అఖిల్ అక్కినేని హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాను బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్ దగ్గర నుంచి […]
అఖిల్ అక్కినేని హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాను బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్ దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు, అలానే గొపిసుందర్ సంగీతసారధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాటకు, ఆ తరువాత విడుదల చేసిన టీజర్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్ లో కొత్త ఉత్సాహన్ని తెచ్చింది.
ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన సంక్రాంతి పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ – పూజా మధ్య కెమిస్ట్రీ కనువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది. సంక్రాంతికి అనుకున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయబోతున్నారు.