మాస్టర్ తేలిపోయాడు
భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన మాస్టర్ సినిమా విజయ్ అభిమానుల్ని నిరాశపరిచింది. సినిమాకు ఓ మోస్తరు రెస్పాన్స్ మాత్రమే వస్తోంది. లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై స్వయంగా విజయ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకు సంబంధించి హైడ్రామా నడిచింది. ఎవరో ఒక ఆకతాయి, సినిమాకు సంబంధించిన 45 నిమిషాల క్లిప్ ను నిన్న సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీనిపై సినిమా యూనిట్ పోలీసులకు ఫిర్యాదు […]
భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన మాస్టర్ సినిమా విజయ్ అభిమానుల్ని నిరాశపరిచింది. సినిమాకు ఓ మోస్తరు రెస్పాన్స్ మాత్రమే వస్తోంది. లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై స్వయంగా విజయ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకు సంబంధించి హైడ్రామా నడిచింది. ఎవరో ఒక ఆకతాయి, సినిమాకు సంబంధించిన 45 నిమిషాల క్లిప్ ను నిన్న సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీనిపై సినిమా యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులతో పాటు వెంటనే స్పందించిన విజయ్ ఫ్యాన్స్.. ఆ వ్యక్తిని పట్టుకున్నారు.
ఇలా రిలీజ్ కు ముందు తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉసూరుమనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ చాలా నీరసంగా ఉందంటున్నారు జనం. మరీ ముఖ్యంగా ఎనర్జిటిక్ గా చూపించాల్సిన విజయ్ ను, నిద్ర మొహంతో మబ్బుగా చూపించి అభిమానుల్ని నిరాశపరిచాడు దర్శకుడు. అటు విలన్ గా నటించిన విజయ్ సేతుపతి మాత్రం మరోసారి తన యాక్టింగ్ తో దుమ్ముదులిపాడు.