Telugu Global
NEWS

మహిళా పైలట్ల సరికొత్త రికార్డు

దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మహిళల సామర్థ్యం పట్ల వివక్ష కనబడుతుంది. కొన్ని పనులు మగవాళ్లు మాత్రమే చేయగలరనే తప్పుడు అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ అభిప్రాయాన్ని భారతీయ మహిళలు బ్రేక్ చేశారు. ఎలాంటి సాహసానికైనా స్త్రీలు వెనకాడరని నిరూపించారు. దేశ వైమానిక రంగ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని సాహసాన్ని ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్లు చేశారు. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణానికి నేతృత్వం వహించారు. ప్రపంచంలోనే రెండో […]

మహిళా పైలట్ల సరికొత్త రికార్డు
X

దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మహిళల సామర్థ్యం పట్ల వివక్ష కనబడుతుంది. కొన్ని పనులు మగవాళ్లు మాత్రమే చేయగలరనే తప్పుడు అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ అభిప్రాయాన్ని భారతీయ మహిళలు బ్రేక్ చేశారు. ఎలాంటి సాహసానికైనా స్త్రీలు వెనకాడరని నిరూపించారు. దేశ వైమానిక రంగ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని సాహసాన్ని ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్లు చేశారు. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణానికి నేతృత్వం వహించారు.

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బోయింగ్‌ 777 విమానాన్ని వేల మైళ్లు నడిపి నవ చరిత్రను నమోదు చేశారు నలుగురు మహిళలు. ఈ ఎయిర్‌ ఇండియా విమానానికి జోయా అగర్వాల్‌ ప్రధాన పైలట్‌గా వ్యవహరించారు. అసిస్టెంట్ పైలట్స్ గా తెలుగు నేలకు చెందిన కెప్టెన్‌ పాపగారి తన్మయితో పాటు కెప్టెన్‌ సోనావారే, కెప్టెన్‌ శివాని మన్హాస్‌ వ్యవహరించారు. 17 గంటల పాటు ఎక్కడా ఆగకుండా విమానాన్ని నడిపిన మహిళా పైలట్ లు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరిన విమానం అట్లాంటిక్ మార్గంలో ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి సోమవారం ఉదయం బెంగళూరుకు చేరింది. 16వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ముగించుకొని బెంగుళూరు చేరుకున్న ఎయిర్ ఇండియా పైలెట్లకు ఘనస్వాగతం లభించింది. ఉత్తర ధృవం మీదుగా ప్రయాణించడంతో పాటు, అందరూ మహిళా పైలట్లే ఈ ప్రయాణాన్ని విజయవంతం చేయడం సంతోషంగా ఉందని పైలట్ జోయా అగర్వాల్ అన్నారు. ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా 10 టన్నుల ఇంధనం ఆదా అయ్యిందని తెలిపారు. ఇదో గొప్ప అనుభవమని సహయ పైలట్ శివానీ తెలిపారు.

నిజానికి ఈ ప్రయాణం గత సంవత్సరంలో జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పట్లో వాయిదా వేశారు. కాగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి మహిళా పైలట్లను ప్రశంసించారు. భారత పౌర విమానయానంలో మహిళా నిపుణులు చరిత్రను సృష్టిస్తున్నారన్నారు. ఎయిర్ ఇండియా మహిళా పైలట్లు సృష్టించిన ఈ రికార్డు దేశ విమానయాన రంగం గర్వించదగ్గది.

First Published:  12 Jan 2021 5:02 AM IST
Next Story