Telugu Global
NEWS

హైకోర్టు వద్దంది.. ఇప్పుడేం జరుగుతుంది..?

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం ఏకపక్షంగా ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కారణంగా ఎన్నికల వాయిదా కోరుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. […]

హైకోర్టు వద్దంది.. ఇప్పుడేం జరుగుతుంది..?
X

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం ఏకపక్షంగా ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కారణంగా ఎన్నికల వాయిదా కోరుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికల షెడ్యూల్ రద్దు చేసింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొన్న ధర్మాసనం, వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్‌ రద్దు చేస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న క్ర‌మంలో, ఆ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌ల‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో నాలుగు ద‌ఫాల్లో నిర్వ‌హించాల‌నుకున్న ఎన్నిక‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్టు హైకోర్టు ప్ర‌క‌టించింది.

నిమ్మగడ్డకు షాక్..
ప్రభుత్వ అనుమతి లేకుండా, సంప్రదింపులు పూర్తి కాకుండా, కనీసం ఎన్నికల సిబ్బంది అభ్యంతరాలు కూడా పట్టించుకోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందని, అమ్మఒడి లాంటి ఫథకాలు ఆపేస్తే మంచిదని కూడా సూచించారు. అంతే కాదు.. గతంలో తాను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన అధికారులందరిపై తక్షణం వేటు వేయాల్సిందిగా సీఎస్ కు లేఖాస్త్రం సంధించారు. కరోనా కష్టకాలంలో ఎన్నికల విధులు నిర్వర్తించలేమంటూ ఉద్యోగులు చెబుతున్నా పట్టించుకోలేదు. అంతే కాదు.. నెలరోజులు సెలవు పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్‌ పై కూడా నిమ్మగడ్డ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా ఇతర ఉద్యోగులను ప్రభావితం చేశారని.. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఆయన్ను విధులనుంచి తొలగించింది. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే.. అసలు ఎన్నికలే వద్దంటూ కోర్టు తీర్పునివ్వడం గమనార్హం.

కిం కర్తవ్యం..?
ఒకవేళ హైకోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకి వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో.. ఎస్ఈసీ సుప్రీంని ఆశ్రయిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా నిమ్మగడ్డ సుప్రీంని ఆశ్రయిస్తే.. ఎన్నికలపై ఆయన స్పెషల్ ఇంట్రస్ట్ ని కచ్చితంగా అనుమానించాల్సిందే.

First Published:  11 Jan 2021 2:28 PM IST
Next Story