Telugu Global
National

మజ్లిస్​కు గట్టి షాక్​ ఇచ్చిన దీదీ..!

పశ్చిమబెంగాల్​లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తున్నది. ఇందుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలను, కీలకనేతలను సైతం చేర్చుకుంటూ దూసుకువెళ్తోంది. దీదీ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే మరోవైపు ఇక్కడ ఎంఐఎం కూడా పోటీచేయాలని భావిస్తోంది. అయితే ఎంఐఎం పోటీలో ఉంటే అది కచ్చితంగా తృణమూల్​ కాంగ్రెస్​కు నష్టం చేకూరుస్తుంది. ఎంఐఎం గణనీయంగా ఓట్లు చీలిస్తే బీజేపీకి లాభం కలుగుతుంది. ఎందుకంటే ముస్లిం ఓటర్లు పశ్చిమబెంగాల్ లో తృణమూల్​ కాంగ్రెస్​కు మద్దతు ఇస్తూ […]

మజ్లిస్​కు గట్టి షాక్​ ఇచ్చిన దీదీ..!
X

పశ్చిమబెంగాల్​లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తున్నది. ఇందుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలను, కీలకనేతలను సైతం చేర్చుకుంటూ దూసుకువెళ్తోంది. దీదీ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే మరోవైపు ఇక్కడ ఎంఐఎం కూడా పోటీచేయాలని భావిస్తోంది. అయితే ఎంఐఎం పోటీలో ఉంటే అది కచ్చితంగా తృణమూల్​ కాంగ్రెస్​కు నష్టం చేకూరుస్తుంది. ఎంఐఎం గణనీయంగా ఓట్లు చీలిస్తే బీజేపీకి లాభం కలుగుతుంది. ఎందుకంటే ముస్లిం ఓటర్లు పశ్చిమబెంగాల్ లో తృణమూల్​ కాంగ్రెస్​కు మద్దతు ఇస్తూ వస్తున్నారు.

ఒకవేళ ఎంఐఎం పోటీచేస్తే.. ఆ పార్టీ ప్రధాన ఓటుబ్యాంకు ముస్లింలు కాబట్టి టీఎంసీ నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే గతంలో పలుమార్లు మమతా బెనర్జీ.. అసద్​పై విమర్శలు గుప్పించారు. ఆయన ఓట్లను చీల్చడానికే ఉన్నారంటూ ఆమె ఆరోపించారు. మరోవైపు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీచేస్తోంది. ఇటీవల బీహార్​లోనూ పోటీచేసింది. అక్కడ ఎంఐఎం పోటీచేయడంతో కాంగ్రెస్​ తీవ్రంగా నష్టపోయింది. అయితే బీజేపీ ప్రోద్బలంతోనే ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీచేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ కూడా పోటీచేయాలని ఎంఐఎం వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇటీవల హైదరాబాద్​లో పశ్చిమబెంగాల్​కు చెందిన ఎంఐఎం నేతలు హైదరాబాద్​లో అసదుద్దీన్​తో భేటీ అయ్యారు. పోటీవిషయంపై చర్చించుకున్నారు.

అయితే ఎంఐఎం పశ్చిమబెంగాల్​లో పోటీచేస్తే నష్టం తప్పదని భావించిన తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ.. ఎలాగైనా ఆ పార్టీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా బెంగాల్ మజ్లిస్ రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడు ఎస్ కే అబ్డుల్ కలాంను ఆమె తన పార్టీ వైపునకు తిప్పుకున్నారు.

ఇటీవల అబ్దుల్​ కలాం తృణమూల్​ తీర్థం పుచ్చుకున్నారు. బెంగాల్​లో ఎంఐఎం వ్యవహారాలన్నీ కలాం చూసుకునేవారు. ఆయన ఇప్పుడు ఎంఐఎంను వీడటంతో అసద్​.. కొత్త సారథి కోసం వెతుకుతున్నారు. అయితే దీదీ.. అసద్​కు ఆదిలోనే షాక్​ ఇచ్చిందని బెంగాల్​ మీడియా కథనాలు రాసింది. ముస్లింలను ఎంఐఎం కేవలం ఓటుబ్యాంక్​ గానే వాడుకుంటుందని.. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే అసద్​ బెంగాల్లో కాలు మోపుతున్నారని మమతా బెనర్జీ గతంలో అనేకసార్లు ఆరోపించారు. ముస్లింలు ఎంఐఎం ట్రాప్​లో పడొద్దని ఆమె పిలుపునిచ్చారు.

First Published:  11 Jan 2021 2:40 PM IST
Next Story