Telugu Global
NEWS

మోగనున్న బడిగంట

తెలంగాణలో బడిగంట మోగనుంది. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రులు, కలెక్టర్లతో భేటీ అయిన ముఖ్యమంత్రి విద్య, వైద్య, రెవెన్యూ శాఖలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొమ్మిదో తరగతి, ఆ పైన తరగతులకు క్లాసులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటికే విద్యాశాఖ రూపొందించిన నివేదికపై ముఖ్యమంత్రి చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించిన ముఖ్యమంత్రి స్థానిక పరిస్థితులకు తగిన […]

మోగనున్న బడిగంట
X

తెలంగాణలో బడిగంట మోగనుంది. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రులు, కలెక్టర్లతో భేటీ అయిన ముఖ్యమంత్రి విద్య, వైద్య, రెవెన్యూ శాఖలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొమ్మిదో తరగతి, ఆ పైన తరగతులకు క్లాసులు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటికే విద్యాశాఖ రూపొందించిన నివేదికపై ముఖ్యమంత్రి చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించిన ముఖ్యమంత్రి స్థానిక పరిస్థితులకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సంక్రాంతి పండుగ తరువాత పాఠశాలలు ప్రారంభించాలని విద్యా శాఖ భావించినప్పటికీ వ్యాక్సినేషన్ నేపథ్యంతో మరికొంత సమయం ఆగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. తాజా నిర్ణయంతో 10 నెలల తరువాత పాఠశాలలు
తిరిగి ప్రారంభం కానున్నాయి.

జనతా కర్ఫ్యూ నాటి నుంచీ తెలంగాణలో విద్యా సంస్థలు నడవడం లేదు. పాఠశాల విద్యార్థులందరినీ పరీక్షలు నిర్వహించడానే తరువాత తరగతికి ప్రమోట్ చేశారు. జూన్ లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సిన‌ప్ప‌టికీ కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో విద్యా సంస్థలు ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నాయి. ప్రభుత్వం సైతం టెలివిజన్ ప్రసారాల ద్వారా బోధిస్తోంది. కాగా… ఆన్ లైన్ బోధన పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్ర‌స్తుతం వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభానికి మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

విద్యా సంస్థల పునఃప్రారంభంతో పాటు రెవెన్యూ శాఖ సమస్యలపై కూడా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల విషయంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. మొత్తానికి అన్నివర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

First Published:  11 Jan 2021 9:31 AM GMT
Next Story