Telugu Global
International

ట్రంప్ కి అండగా బీజేపీ ఉండగా

అమెరికాలో అధికార మార్పిడికి ముందే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడి తాజా పరిణామాలకు కేంద్రంగా మారింది. జనవరి 20వ తేదీ వరకు ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అంతకు ముందే ఆయనను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బైడెన్ ప్రమాణ స్వీకారం వరకు ఆయన పదవిలో ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని డెమోక్రట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిశంసన ద్వారా ట్రంప్ ను తప్పించాలనుకుంటున్నారు. అధికార […]

ట్రంప్ కి అండగా బీజేపీ ఉండగా
X

అమెరికాలో అధికార మార్పిడికి ముందే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడి తాజా పరిణామాలకు కేంద్రంగా మారింది. జనవరి 20వ తేదీ వరకు ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అంతకు ముందే ఆయనను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బైడెన్ ప్రమాణ స్వీకారం వరకు ఆయన పదవిలో ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని డెమోక్రట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిశంసన ద్వారా ట్రంప్ ను తప్పించాలనుకుంటున్నారు.

అధికార మార్పిడిని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతు దారులు యత్నించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ తీరుపట్ల స్వంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార మార్పిడికి ముందే ట్రంప్‌ను సాగనంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుగుబాటును ప్రేరేపించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

కాగా… ప్రతినిధుల సభలో మొదట అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి, అక్కడ ఆమోదించిన అనంతరం దాన్ని సెనెట్ కి పంపిస్తారు. అక్కడ వాదనల అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణను పరిశీలిస్తారు. సెనెట్ లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. కానీ ప్రస్తుతం డెమోక్రట్లకు అంత మెజార్టీ లేదు. కనుక ఒకవేళ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టినా డెమోక్రట్లు నెగ్గే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ ను పదవీచ్యుత్యుణ్ని చేయడం సాధ్యంకాకపోయినా మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు డెమోక్రట్లు.

మరోవైపు ట్రంప్ కి ఎదురవుతున్న అవమానాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. కేపిటల్ భవనంపై దాడికి యత్నించిన తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ సామాజిక మాద్యమాల్లో ట్రంప్ చేసిన పోస్టులు కలకలం రేపాయి. ట్రంప్ పోస్టులు రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధించింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లు జనవరి 20 వరకు ఆయన అకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. కాగా… ట్విట్టర్ నిర్ణయాన్ని ట్రంప్ తప్పు బట్టారు. తన మద్దతుదారులు ఊరుకోరంటూ హెచ్చరించారు.

ట్రంప్ వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ తొలగించడంతో అధ్యక్షుడి హోదాలో అధికారిక అకౌంట్ ని ఆయన వినియోగిస్తున్నారు. ట్విట్టర్ లో స్వేచ్ఛగా భావాలు వ్యక్తంచేసే అవకాశంలేదని, ట్విట్టర్ వామపక్ష భావాలను ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగించడాన్ని రిపబ్లికన్ నేత, ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలీ తప్పుబట్టారు. ‘ఇది అమెరికా.. చైనా కాదు’ అంటూ ఎద్దేవా చేశారు.

ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తొలగించడం పట్ల ఇటు భారతదేశంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను నిషేధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు అందరికంటే ఎక్కువ కలతచెందుతుండడం గమనార్హం. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తొలగించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు హెచ్చరిక అని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. నియంత్రణ లేని సామాజిక మాద్యమ సంస్థల వల్ల పొంచిఉన్న ప్రమాదానికి ఈ ఘటన సంకేతమన్నారు. భారత్ లో ఇలాంటివి జరగకుండా నిబంధనలను సవరించాలన్నారు. కాగా… తేజస్వి సూర్య వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  10 Jan 2021 1:03 PM IST
Next Story