ఇది ఫిక్స్.. సాగర్ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్..!
కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ లేటే.. అభ్యర్థుల ఎంపిక.. పొత్తులు ఎత్తులు.. ఇలా ప్రతివిషయంలోనూ ఆలస్యంగానే స్పందిస్తుంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడి ప్రకటన విషయంలోనూ ఎన్నిరోజులుగా నాన్చుడు ధోరణి అవలంభిస్తుందో చూస్తునే ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేలోపే ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోతుంటాయి. అంతర్గత కుమ్ములాటలు ముగించుకుని కాంగ్రెస్ ప్రచారపర్వంలోకి వచ్చేసరికి ప్రత్యర్థి పార్టీలు ఓ రౌండ్ ప్రచారం ముగించేస్తాయి. ఇదీ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ వరస. కానీ తాజాగా సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ […]
కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ లేటే.. అభ్యర్థుల ఎంపిక.. పొత్తులు ఎత్తులు.. ఇలా ప్రతివిషయంలోనూ ఆలస్యంగానే స్పందిస్తుంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడి ప్రకటన విషయంలోనూ ఎన్నిరోజులుగా నాన్చుడు ధోరణి అవలంభిస్తుందో చూస్తునే ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేలోపే ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోతుంటాయి. అంతర్గత కుమ్ములాటలు ముగించుకుని కాంగ్రెస్ ప్రచారపర్వంలోకి వచ్చేసరికి ప్రత్యర్థి పార్టీలు ఓ రౌండ్ ప్రచారం ముగించేస్తాయి. ఇదీ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ వరస.
కానీ తాజాగా సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అలర్టయ్యింది. ఈ సారి అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసింది. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కానీ ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి కానీ పోటీచేస్తారని తొలి నుంచి అంతా భావించారు. కానీ రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. అయితే నేరుగా జానారెడ్డి రంగంలోకి దిగి ఈ ప్రచారానికి తెరదించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. తన కుమారుడు కూడా బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
కాగా నిన్న ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అని ప్రకటించేశారు. దీంతో ఈ సారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుగానే రంగంలోకి దిగినట్టు అయ్యింది. అక్కడ ఇంకా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు.
జానారెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తమకు ఎంతో పట్టున్న సాగర్‌లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.