మళ్లీ హీరోగా మారిన సునీల్
లాంగ్ గ్యాప్ తర్వాత నటుడు సునీల్ మళ్లీ హీరోగా మారాడు. అతడు హీరోగా వేదాంతం రాఘవయ్య అనే ప్రాజెక్టు ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే డైరక్టర్ హరీష్ శంకర్ దీనికి కథ అందించాడు. ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. సి.చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న `వేదాంతం రాఘవయ్య` సినిమా.. ఈ రోజు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి […]
లాంగ్ గ్యాప్ తర్వాత నటుడు సునీల్ మళ్లీ హీరోగా మారాడు. అతడు హీరోగా వేదాంతం రాఘవయ్య అనే ప్రాజెక్టు ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే డైరక్టర్ హరీష్ శంకర్ దీనికి కథ అందించాడు. ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
సి.చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న 'వేదాంతం రాఘవయ్య' సినిమా.. ఈ రోజు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి, మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించాడు. నిర్మాత గోపి ఆచంట కెమెరా స్విచాన్ చేయగా, స్క్రిప్ట్‌ను రామ్ ఆచంట దర్శకుడు సి.చంద్రమోహన్‌కు అందజేశారు.
అటు హీరో సునీల్, ఇటు కథ అందించిన హరీష్ శంకర్ ఇద్దరూ ఓపెనింగ్ కు రాకపోవడం గమనార్హం. సాయి కార్తిక్ సంగీతం అందిస్తుండగా దాము నర్రవుల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.