నిమ్స్ క్యాన్సర్ విభాగానికి "మేఘా" చేయూత..
హైదరాబాద్ లోని ప్రఖ్యాత నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేయూతనందించింది. రూ.18కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో అధునాతనంగా మేఘా సంస్థ ఏర్పాటు చేసిన అంకాలజీ విభాగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. భవన సదుపాయం, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ సమకూర్చింది. అప్పుడు మాటిచ్చారు.. ఇప్పుడు నెరవేర్చారు.. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం […]
హైదరాబాద్ లోని ప్రఖ్యాత నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేయూతనందించింది. రూ.18కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో అధునాతనంగా మేఘా సంస్థ ఏర్పాటు చేసిన అంకాలజీ విభాగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. భవన సదుపాయం, వైద్య యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ సమకూర్చింది.
అప్పుడు మాటిచ్చారు.. ఇప్పుడు నెరవేర్చారు..
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం 2018 సెప్టెంబరులోనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అంకాలజీ విభాగం ప్రారంభోత్సవానికి వచ్చిన మేఘా సంస్థ చైర్మన్ పి.పి.రెడ్డి, ఎండీ పి.వి కృష్ణారెడ్డి.. మరింత విశాలంగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం నిమ్స్ అంకాలజీ బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థును రోగులు, సిబ్బంది అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించారు. రూ.18 కోట్ల రూపాయలు వెచ్చించి 20వేల చదరపు అడుగుల వైశాల్యంలో 50బెడ్లతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్లు, లిప్టు, సెంట్రలైజ్డ్ ఏసి వంటి అత్యవసర సదుపాయలన్నీంటిని ఏర్పాటు చేశారు.
కొత్త విభాగం ప్రత్యేకతలు ఏంటి..?
నూతనంగా ఏర్పాటు చేసిన అంకాలజీ విభాగంలో పురుషులకు, మహిళలకు విడివిడిగా వార్డులు ఏర్పాటు చేశారు. పిల్లలకోసం కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డు, రక్త క్యాన్సర్ బాధితులకు లుకేమియా వార్డులు కూడా నిర్మించారు. మొత్తం 50 బెడ్లలో 5 ఐసీయూ బెడ్లు, పురుషులకోసం 12 బెడ్లు, మహిళా వార్డులో 10 బెడ్లు, చిన్నపిల్లల వార్డులో 11 బెడ్లు, లుకేమియా వార్డులో 12 బెడ్లు ఏర్పాటు చేశారు. అంకాలజీ విభాగంలోనే నర్సుల కోసం ప్రత్యేకంగా నర్స్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్సలకోసం అంకాలజీ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మేఘా సంస్థ సిద్ధం చేసింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పటికే హైదరాబాద్ లోని నీలోఫర్, ఉస్మానియా, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో భోజన సదుపాయాలను నిర్విరామంగా అందిస్తోంది మేఘా సంస్థ. రోగులతోపాటు, వారి బంధువులకు కూడా భోజన వసతి సమకూరుస్తోంది. తెలంగాణలోని పలు మార్కెట్ యార్డుల్లో రైతులకు, హమాలీలకు సైతం మేఘా సంస్థ భోజన వసతి కల్పిస్తోంది. తాజాగా నిమ్స్ లో అంకాలజీ విభాగాన్ని ఆధునిక పరిచి వైద్యరంగంలోనూ తన సేవలను విస్తృత పరిచింది మేఘా సంస్థ.