మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నూతనంగా ఎన్నికైన కార్పోరేటర్లు.. మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు. కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల వివరాలు త్వరలో గెజిట్ లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు మూడు రోజుల్లోనే గెజిట్ ప్రకటించే అవకాశముంది. తరువాత నెలరోజుల లోపు మేయర్ ఎన్నిక ఉంటుంది. మేయర్ ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. […]
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నూతనంగా ఎన్నికైన కార్పోరేటర్లు.. మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు. కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల వివరాలు త్వరలో గెజిట్ లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు మూడు రోజుల్లోనే గెజిట్ ప్రకటించే అవకాశముంది. తరువాత నెలరోజుల లోపు మేయర్ ఎన్నిక ఉంటుంది.
మేయర్ ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4 వెలువడ్డాయి. అధికార పార్టీ మేయర్ పీఠానికి సమీప దూరంలో ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేక పోయిన టీఆర్ఎస్ 55 సీట్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అధికార పార్టీ నుంచి దాదాపు సగం సీట్లను కొల్లగొట్టిన బీజేపీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మజ్లిస్ గతంలో ఉన్న 44 స్థానాలను పదిలం చేసుకోగలిగింది.
ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మేయర్ పీఠం కోసం పొత్తులు తప్పేలా లేవు. మొదటి నుంచీ టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న స్నేహబంధం కారణంగా ఆ రెండు పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకునే అవకాశాలున్నాయి. కానీ ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఎన్నికలకు… ముందు వందకుపైగా సీట్లు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేసింది. కానీ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయంటూ బీజేపీ మొదటి నుంచీ వాదిస్తోంది. ఫలితాలు తారుమారవ్వడంతో బీజేపీ వాదనకు బలం చేకూరేలా మారాయి పరిస్థితులు.
మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్ కు మజ్లిస్ సహకారం తప్పని సరి. గతంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఎంఐఎం సహకారంతోనే మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కాగా… టీఆర్ఎస్ మాత్రం ప్రత్యక్షంగా ఎంఐఎం సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదనే వాదన వినిపిస్తోంది. తమ కార్పోరేటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
కార్పోరేటర్ల సంఖ్య పెంచులేకపోయినా.. మేయర్ ఎన్నిక సందర్భంగా మ్యాజిక్ ఫిగర్ ని మార్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఎంఐఎం కార్పోరేటర్లు మేయర్ ఎన్నికలో పాల్గొనకుండా మేనేజ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. తద్వారా సునాయాసం మేయర్ పీఠాన్ని దక్కించుకోగలుగుతుంది. మొత్తానికి మేయర్ ఎన్నిక ఉత్కంఠరేపుతోంది. మరి అధికార పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి మరి.