Telugu Global
National

ఊహించిందే జరిగింది .. సాగర్​ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ..!

అంతా ఊహించినట్టుగానే పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని కాంగ్రెస్​ పార్టీ వాయిదా వేసింది. ఈ మేరకు కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్​ గురువారం అధికారికంగా ప్రకటించారు. సాగర్​ ఉప ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్​ కుమార్​రెడ్డే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. జానారెడ్డి అభ్యర్థన మేరకు పీసీసీ ప్రకటనను వాయిదా వేసినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్​ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిస్తారన్న అంశం హాట్​టాఫిక్​గా మారింది. రాజకీయాలు మొత్తం ఈ అంశం చుట్టూ […]

ఊహించిందే జరిగింది .. సాగర్​ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ..!
X

అంతా ఊహించినట్టుగానే పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని కాంగ్రెస్​ పార్టీ వాయిదా వేసింది. ఈ మేరకు కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్​ గురువారం అధికారికంగా ప్రకటించారు. సాగర్​ ఉప ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్​ కుమార్​రెడ్డే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. జానారెడ్డి అభ్యర్థన మేరకు పీసీసీ ప్రకటనను వాయిదా వేసినట్టు సమాచారం.

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్​ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిస్తారన్న అంశం హాట్​టాఫిక్​గా మారింది. రాజకీయాలు మొత్తం ఈ అంశం చుట్టూ తిరిగాయి. కొంతకాలంపాటూ రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. ఆ తర్వాత అనూహ్యంగా జీవన్​రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది.

రేవంత్​రెడ్డికి ప్రచారకమిటీ చైర్మన్​ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని వార్తలు వచ్చాయి. తాను ప్రచారకమిటీ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడతానని అంతకు ముందు రోజు ఓ మీడియా చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్​ చెప్పారు. ఆ తర్వాత రోజే ఇటువంటి ఊహాగానాలు రావడం గమనార్హం. మరోవైపు పీసీసీ అధ్యక్షపదవి.. ప్రచారకమిటీ చైర్మన్​ పదవి.. వర్కింగ్​ ప్రెసిడెంట్​ ఇలా కీలకపదవులన్నీ రెడ్లకు ఇస్తే ఎలా అంటూ కొందరు బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.

మరోవైపు సాగర్​ ఉప ఎన్నిక జరిగే వరకు పీసీసీ ప్రకటన వాయిదా వేయాలని.. లేదంటే ఆ ప్రభావం ఎన్నికల మీద పడుతుందని జానారెడ్డి అధిష్ఠానానికి చెప్పినట్టు సమాచారం. సాగర్​ ఉప ఎన్నిక వరకు పీసీసీ అధ్యక్ష ప్రకటన వాయిదా వేయబోతున్నారంటూ .. ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఠాగూర్​ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సాగర్​ ఉప ఎన్నిక అనంతరం పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తాం. అప్పటివరకు ఉత్తమ్​ కుమార్​రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఇది మా అసమర్థత కాదు. కాంగ్రెస్​ పార్టీ ఎంతో ప్రజాస్వామ్యయుతంగా సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్​ పార్టీ జేపీ నడ్డా లాంటి డమ్మీ క్యాండెట్లను అధ్యక్షుడిగా నియమించదు. సమర్థుడికే పదవి అప్పజెపుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు సాగర్​ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయినట్టు సమాచారం. జానారెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారట. అయితే జానారెడ్డి కుమారుడు రఘువీర్​రెడ్డి బరిలో ఉంటారని తొలుత భావించారు. కానీ ఆ తర్వాత మళ్లీ జానారెడ్డికే అవకాశం ఇవ్వాలని హై కమాండ్​ నిర్ణయం తీసుకున్నదట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.

First Published:  8 Jan 2021 2:53 AM IST
Next Story