ఆర్థిక నేరగాడితో మాజీ సీఎం భార్య లావాదేవీలు.. ఇంతకీ ఏమిటి విషయం?
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య, ప్రముఖ నటి రాధిక చిక్కుల్లో పడ్డారు. ఇటీవల పోలీసులకు చిక్కిన ఓ ఆర్థికనేరగాడు ఆమె అకౌంట్లోకి భారీగా నగదు పంపించడమే ఇందుకు కారణం. అయితే ఈ ఆర్థికనేరాలతో నటి రాధికకు.. ఆమె భర్త కుమారస్వామికి ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయనాయకుల పేరుతో పలువురిని మోసగించిన కేసులో యువరాజ్ అలియాస్ స్వామి అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు చిక్కాడు. యువరాజ్ ఆర్ఎస్ఎస్ నాయకుడినని.. తనకు […]
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో భార్య, ప్రముఖ నటి రాధిక చిక్కుల్లో పడ్డారు. ఇటీవల పోలీసులకు చిక్కిన ఓ ఆర్థికనేరగాడు ఆమె అకౌంట్లోకి భారీగా నగదు పంపించడమే ఇందుకు కారణం. అయితే ఈ ఆర్థికనేరాలతో నటి రాధికకు.. ఆమె భర్త కుమారస్వామికి ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయనాయకుల పేరుతో పలువురిని మోసగించిన కేసులో యువరాజ్ అలియాస్ స్వామి అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు చిక్కాడు. యువరాజ్ ఆర్ఎస్ఎస్ నాయకుడినని.. తనకు పలువురు పెద్దలు పరిచయమున్నారని చెప్పి.. అనేక మందిని మోసగించాడు. వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు.
అయితే ఈ కేసును విచారిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. యువరాజ్ ఇటీవల తన అకౌంట్నుంచి భారీ మొత్తంలో నగదును మాజీ సీఎం భార్య రాధికకు పంపినట్టు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. రాధిక ప్రముఖ నటి.. ఆమె తెలుగులో కూడా ఓ చిత్రంలో నటించారు.
ఆమెను కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. కుమారస్వామి మొదటి భార్య అనితా కుమారస్వామి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ప్రస్తుతం జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే యువరాజ్‌కు రాధికకు మధ్య ఆర్థికలావాదేవీలు జరగడం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో భాగంగా సైబర్ క్రైం పోలీసులు రాధికను కూడా విచారించనున్నారు. ఇప్పటికే ఆమెకు నోటీసులు పంపించారు. ఈ విషయంపై రాధిక స్పందించారు. యువరాజ్‌కు తమ కుటుంబంతో 17 ఏళ్లుగా పరిచయం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ చారిత్రత్మక సినిమా తీసేందుకు యువరాజ్ తనకు రూ. 15 లక్షలు, మరో నిర్మాత రూ. 60 లక్షలు పంపించారని చెప్పారు. అంతేకానీ అతడితో తనకు ఏ రకమైన ఆర్థికలావాదేవీలు లేవని చెప్పారు. పోలీసులు ఇప్పటికే రాధిక సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. రేపు రాధికను కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.