Telugu Global
Cinema & Entertainment

థ్యాంక్ యు కథ ఇదేనా?

నాగచైతన్య కొత్త సినిమా పేరు థ్యాంక్ యూ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూద్దాం. . ఈ సినిమాలో నాగచైతన్య రోల్ ఏంటంటే.. థియేటర్ల వద్ద హీరోలకు కటౌట్లు కడుతుంటాడు. పైగా మహేష్ బాబు అభిమాని. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్. ఇలాంటి కుర్రాడు, అందరి సహకారంలో విదేశాలకు […]

థ్యాంక్ యు కథ ఇదేనా?
X

నాగచైతన్య కొత్త సినిమా పేరు థ్యాంక్ యూ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూద్దాం. .

ఈ సినిమాలో నాగచైతన్య రోల్ ఏంటంటే.. థియేటర్ల వద్ద హీరోలకు కటౌట్లు కడుతుంటాడు. పైగా మహేష్ బాబు అభిమాని. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫేమస్. ఇలాంటి కుర్రాడు, అందరి సహకారంలో విదేశాలకు వెళ్లి, ఏకంగా అక్కడ పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు.

అలా పెద్ద బిజినెస్ మేన్ గా మారిన నాగచైతన్య.. తనకు సహాయం చేసిన వాళ్ల రుణం ఎలా తీర్చుకున్నాడు.. వాళ్లకు ఎలా థ్యాంక్ యు చెప్పాడనేది ఈ సినిమా కథ. ప్రస్తుతానికైతే ఈ సినిమా కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

కాకపోతే విక్రమ్ కుమార్ సినిమాల్లో లైన్ సింపుల్ గా ఉన్నా.. కథనం మాత్రం చాలా పకడ్బందీగా ఉంటుంది. థ్యాంక్ యూ కూడా అలానే కొత్తగా ఉండబోతోంది.

First Published:  6 Jan 2021 12:46 PM IST
Next Story