Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి నుంచి తప్పుకున్న రానా

సంక్రాంతికి వస్తున్నట్టు అందరికంటే ముందు ప్రకటించాడు హీరో రానా. అతడు నటించిన తాజా చిత్రం అరణ్య సంక్రాంతి బరిలోకి వస్తుందంటూ, గతేడాది అక్టోబర్ లోనే ప్రకటించారు. అయితే ఆ తర్వాత సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్ పోన్ అయి ఉంటుందని చాలా మంది భావించారు. ఇప్పుడదే జరిగింది. అరణ్య సినిమా సంక్రాంతికి రావడం లేదు. ఈ మూవీని మార్చి 26న విడుదల చేయబోతున్నట్టు రానా స్వయంగా ప్రకటించారు. […]

సంక్రాంతి నుంచి తప్పుకున్న రానా
X

సంక్రాంతికి వస్తున్నట్టు అందరికంటే ముందు ప్రకటించాడు హీరో రానా. అతడు నటించిన తాజా చిత్రం అరణ్య సంక్రాంతి బరిలోకి వస్తుందంటూ, గతేడాది అక్టోబర్ లోనే ప్రకటించారు. అయితే ఆ తర్వాత సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో మూవీ పోస్ట్ పోన్ అయి ఉంటుందని చాలా మంది భావించారు. ఇప్పుడదే జరిగింది.

అరణ్య సినిమా సంక్రాంతికి రావడం లేదు. ఈ మూవీని మార్చి 26న విడుదల చేయబోతున్నట్టు రానా స్వయంగా ప్రకటించారు. సినిమాను వాయిదా వేయడానికి, మార్చి 26నే విడుదల చేయడానికి ఓ కారణం ఉంది.

అరణ్య సినిమా పాన్ ఇండియా మూవీ. ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేయాలి. ఈ సంక్రాంతికి అలా చేయడం సాధ్యపడలేదు. పైగా ప్రచారానికి కూడా టైమ్ లేదు. అందుకే వాయిదాపడింది. ఇక తేదీ విషయానికొస్తే.. మార్చి 26 నుంచి లాంగ్ వీకెండ్ నడుస్తోంది. ఏకంగా 4 రోజుల పాటు శెలవులు వస్తున్నాయి. అందుకే ఆ తేదీని లాక్ చేశాడు రానా.

First Published:  6 Jan 2021 12:37 PM IST
Next Story