చరణ్ కోసం రాజమౌళి వెయిటింగ్
రామ్ చరణ్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్ లో ఉన్నాడు. అతడి కోసం దర్శకుడు రాజమౌళి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. కేవలం రాజమౌళి మాత్రమే కాదు.. ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం ఎదురుచూస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఓ గ్రూప్ సాంగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియాభట్.. ఇలా ప్రధాన తారగణం అంతా పాల్గొంటారు. సెట్ రెడీ అయింది, అందరి […]
రామ్ చరణ్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్ లో ఉన్నాడు. అతడి కోసం దర్శకుడు రాజమౌళి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. కేవలం రాజమౌళి మాత్రమే కాదు.. ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం ఎదురుచూస్తోంది. దీనికి ఓ కారణం ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఓ గ్రూప్ సాంగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియాభట్.. ఇలా ప్రధాన తారగణం అంతా పాల్గొంటారు. సెట్ రెడీ అయింది, అందరి కాల్షీట్లు సెట్ అయ్యాయి. అంతలోనే చరణ్ కరోనా బారిన పడ్డాడు.
దీంతో కీలకమైన ఆ సాంగ్ షూటింగ్ ఆగిపోయింది. అన్ని కాల్షీట్లు వృధా అయిపోయాయి. అది పూర్తయితే తప్ప రాజమౌళి ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే జక్కన్నతో పాటు యూనిట్ అంతా చరణ్ కోసం వెయిటింగ్. సినిమాలో ఆ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందట.