వాళ్లిద్దరి మధ్య మరోసారి సంక్రాంతి పోటీ
గతేడాది సంక్రాంతికి తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య రసవత్తర పోటీ నడిచింది. ఇప్పుడు అదే పోటీ మళ్లీ మొదలైంది. ఈసారి సంక్రాంతికి కూడా వీళ్లిద్దరూ సంగీతం అందించిన సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. తమన్ సంగీతం అందించిన క్రాక్ సినిమా 9వ తేదీన రిలీజ్ అవుతోంది. ఇక దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా 15న రిలీజ్ అవుతోంది. ఆడియో పరంగా ఈ రెండు సినిమాలు ఒకే రకమైన […]
గతేడాది సంక్రాంతికి తమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య రసవత్తర పోటీ నడిచింది. ఇప్పుడు అదే పోటీ మళ్లీ మొదలైంది. ఈసారి సంక్రాంతికి కూడా వీళ్లిద్దరూ సంగీతం అందించిన సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
తమన్ సంగీతం అందించిన క్రాక్ సినిమా 9వ తేదీన రిలీజ్ అవుతోంది. ఇక దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా 15న రిలీజ్ అవుతోంది. ఆడియో పరంగా ఈ రెండు సినిమాలు ఒకే రకమైన రెస్పాన్స్ రాబట్టాయి. థియేటర్లలోకి వచ్చిన తర్వాత అసలైన మ్యూజికల్ హిట్ ఏంటనేది తేలుతుంది.
గతేడాది కూడా ఈ ఇద్దరు సంగీత దర్శకుల మధ్య గట్టి పోటీ నడిచింది. తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురములో, డీఎస్పీ మ్యూజిక్ ఇచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాల్లో పాటలు బాగున్నప్పటికీ.. అల వైకుంఠపురములో సాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి. దీంతో తమన్ దే పైచేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.