Telugu Global
Cinema & Entertainment

2021 లాంగ్ వీకెండ్ ప్లాన్

2020 బాధాకరంగా ముగిసిన తర్వాత 2021 చాలా గుడ్ న్యూస్‌లను మోసుకొచ్చింది. అందులో ఒకటే.. లాంగ్ వీకెండ్స్. ఈ సంవత్సరంలో చాలా లాంగ్ వీకెండ్‌లున్నాయి. ఈ వీకెండ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి. ఆయా టైంలో ఎక్కడికి టూర్స్ ప్లాన్ చేయొచ్చో ఓ సారి చూద్దాం. జనవరి జనవరి 14 న మకర సంక్రాంతి. దాని తర్వాత జనవరి 16, 17 వరుసగా శని, ఆది వారాలు. మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుంటే మొత్తంగా నాలుగు రోజులు సెలవలొస్తాయి. అలాగే […]

2021 లాంగ్ వీకెండ్ ప్లాన్
X

2020 బాధాకరంగా ముగిసిన తర్వాత 2021 చాలా గుడ్ న్యూస్‌లను మోసుకొచ్చింది. అందులో ఒకటే.. లాంగ్ వీకెండ్స్. ఈ సంవత్సరంలో చాలా లాంగ్ వీకెండ్‌లున్నాయి. ఈ వీకెండ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి. ఆయా టైంలో ఎక్కడికి టూర్స్ ప్లాన్ చేయొచ్చో ఓ సారి చూద్దాం.
జనవరి
జనవరి 14 న మకర సంక్రాంతి. దాని తర్వాత జనవరి 16, 17 వరుసగా శని, ఆది వారాలు. మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుంటే మొత్తంగా నాలుగు రోజులు సెలవలొస్తాయి. అలాగే జనవరి 23, 24 శని, ఆదివారాలు ఆ తర్వాత జనవరి 26 మంగళవారం పబ్లిక్ హాలిడే.. మధ్యలో సోమవారం లీవ్ తీసుకుంటే మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవలొస్తాయి. ఇలా మొత్తంగా జనవరిలో రెండు లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. ఈ టైంలో చల్లటి ప్రదేశాలకు టూర్ వేయొచ్చు. మహారాష్ట్రలోని లొనావ్లా, పాండిచేరి, తమిళనాడులోని కొడైకెనాల్, ఊటీ, కర్ణాటకలోని కూర్గ్ లాంటి ప్లేసులు ఈ నెలలో విజిట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
ఫిబ్రవరి
ఫిబ్రవరి 13, 14 శని ఆది వారాలు ఆ తర్వాత 16 వసంత పంచమి. మధ్యలో సోమవారం లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు సెలవలొస్తాయి. ఈ సీజన్‌లో అప్పుడప్పుడే చలి తగ్గుతూ ఉంటుంది. ఈ టైంలో ముంబైకి దగ్గర్లోని భాందార్దారా, కోల్‌కతాకు దగ్గర్లోని సుందర్బాన్స్, తమిళనాడులోని ఏలగిరి కొండలు విజిట్ చేయడానికి అనుకూలం.
మార్చి
మార్చి 11న గురువారం మహాశివరాత్రి ఆ తర్వాత వరుసగా 13,14 శని ఆది వారాలు మధ్యలో శుక్రవారం లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగురోజులు సెలవలొస్తాయి. అలాగే మార్చి 27,28న శని ఆది వారాలు ఆ తర్వాత 29న హోలీ ఇలా ఈ నెలలో మరో మూడురోజుల లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. ఈ నెలలో కేరళలోని, అలపుజా, మున్నార్, కోజికోడై, కొచ్చి లాంటి ప్లేసులు విజిట్ చేయడానికి అనుకూలం.
ఏప్రిల్
ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే ఆ తర్వాత వరుసగా 3,4న శని ఆదివారాలు వచ్చాయి. ఇలా మార్చిలో మూడురోజుల లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ నెలలో మనాలి, లేహ్, డార్జిలింగ్, మధేరన్ లాంటి ప్లేసులు విజిట్ చేయడానికి అనుకూలం.
మే
మే 13న ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ ఉంది. ఆ తర్వాత 15,16న వరుసగా శని ఆదివారాలు. మధ్యలో ఒక శుక్రవారం లీవ్ తీసుకుంటే నాలుగురోజుల సెలవలొస్తాయి. ఈ సీజన్‌లో తమిళనాడులోని సక్లేశ్‌పూర్, ఊటీ, గోవా లాంటి ప్లేసులు విజిట్ చేయడానికి బాగుంటాయి.
జులై
జులై 17,18న శని ఆదివారాలు ఆ తర్వాత 20న బక్రీద్ పండుగ ఉంది. మధ్యలో 19న లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగురోజుల వీకెండ్ కలిసొస్తుంది. ఈ సీజన్ లో హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీవాలీ, ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఒడిశాలోని పూరి, కోణార్క్, కర్నాటకలోని హంపి లాంటి ప్లేసులు విజిట్ చేయడానికి అనుకూలం.
ఆగస్ట్
ఈ నెల 28,29న వరుసగా శని, ఆది వారాలు ఆ తర్వాత 30న శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ మూడురోజుల వీకెండ్‌లో ఢిల్లీ, ఆగ్రా, బృందావన్, మధుర టూర్ ప్లాన్ చేయొచ్చు.
సెప్టెంబర్
సెప్టెంబర్ 10న గణేశ్ చతుర్ధి శుక్రవారం వచ్చింది. ఆ తర్వాత వరుసగా శని ఆది వారాలు. ఈ మూడురోజుల లాంగ్ వీకెండ్ లో ముస్సోరీ, కేరళ, మేఘాలయ, అరకులోయ లాంటి ప్లేసులు విజిట్ చేయడానికి బాగుంటాయి.
అక్టోబర్
ఈ సారి దసరా పండుగ అక్టోబర్ 15న శుక్రవారం వచ్చింది. ఆ తర్వాత శని ఆది వారాలు. కాబట్టి ఈ నెలలో కూడా మూడు రోజుల లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ సీజన్‌లో నాగర్ హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్‌లు విజిట్ చేయడానికి అనుకూలం.
డిసెంబర్
డెసెంబర్ 25న క్రిస్టమస్ ఈ సారి శనివారం వచ్చింది. దానికి మందు శుక్రవారం లీవ్ తీసుకుంటే వరుసగా మూడురోజుల సెలవలొస్తాయి. ఈ సీజన్ లో మనాలి, ఆళి, రన్ ఆఫ్ కచ్, గోవా, అలపుజా లాంటి ప్లేసులు విజిట్ చేయడానికి బాగుంటాయి.

First Published:  5 Jan 2021 9:23 AM IST
Next Story