Telugu Global
NEWS

పెద్దాయన చుట్టే అందరి చూపులు

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత ఇప్పుడు పార్టీల చూపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడింది. ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో దుబ్బాక ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటోంది బీజేపీ. అధికార పార్టీ సైతం పట్టు నిలుపుకోవాలనుకుంటోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సాగర్ పై ఆశలు పెట్టుకుంది. అన్ని పార్టీలూ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక […]

పెద్దాయన చుట్టే అందరి చూపులు
X

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత ఇప్పుడు పార్టీల చూపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడింది. ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో దుబ్బాక ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటోంది బీజేపీ. అధికార పార్టీ సైతం పట్టు నిలుపుకోవాలనుకుంటోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సాగర్ పై ఆశలు పెట్టుకుంది. అన్ని పార్టీలూ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం అన్ని జెండాల చూపూ ఒక్కరి వైపే ఉంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో అందరికంటే ముందే కమలం పార్టీ కళ్లు తెరిచింది. స్థానికంగా బలమైన నాయకుడిని బరిలోకి దింపడం ద్వారా అధికార పార్టీని ఢీకొట్టాలని యోచించింది. అందుకోసం సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుటుంబంపైనే కన్నేసింది. ఒకదశలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతోందని ప్రచారం జోరుగా సాగింది. పీపీసీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో జానారెడ్డి సైతం బీజేపీ గూటికి చేరుతారనే వాదనలు వినిపించాయి. కాగా… ఆ ప్రచారానికి జానారెడ్డి
చెక్ పెట్టారు. తాను బీజేపీలో చేరబోనని స్పష్టంచేశారు. దీంతో బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి.

సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ ఎమ్మెల్యే కుంటుంబ సభ్యులకే టికెట్ ఇస్తోంది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా సోలిపేట రామలింగారెడ్డి మృతి తరువాత, దుబ్బాక ఉప ఎన్నికలో ఆయన భార్య సుజాతకు అవకాశం ఇచ్చింది. కానీ దుబ్బాక ఫలితాల తరువాత టీఆర్ఎస్ తన ఆలోచన మార్చుకుంది. నాగార్జున సాగర్ టికెట్ నోముల కుటుంబానికి ఇవ్వాలనుకోవడం లేదు. స్థానికంగా బలమైన నాయకుడిని బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ దృష్టి కూడా జానారెడ్డి పైనే పడినట్లు తెలుస్తోంది.

మరోవైపు వరుస వైఫల్యాలతో ఎలక్షన్ అంటేనే కాంగ్రెస్ కు వణుకుపుడుతోంది. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. నాగార్జున సాగర్ లో సైతం ఓటమి ఎదురైతే పరిస్థితి ఏంటీ? అనే సందిగ్ధం కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారింది. కాగా… నాగార్జున సాగర్ లో క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల సర్వే చేయించినట్లు తెలుస్తోంది. సర్వేలో జనారెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని తేలిందట.

వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ నాగార్జున్ సాగర్ ఉపఎన్నికను టర్నింగ్ పాయింట్ గా వాడుకోవాలనుంటోందట. పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపేందుకు కూడా ఈ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అటు అధికార పార్టీని, ఇటు బీజేపీని ఢీకొనాలంటే జానారెడ్డినే బరిలోకి దించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి జానారెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతారో లేదో చూడాలి.

First Published:  3 Jan 2021 5:45 AM GMT
Next Story