Telugu Global
NEWS

కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి ముహూర్తం కుదిరిందా..?

కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ కి అన్నీ తానే అనే స్టేజ్ కి వచ్చేశారు ఆయన తనయుడు కేటీఆర్. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే.. కొడుక్కి పట్టాభిషేకం చేయాలనే ఆలోచన కేసీఆర్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే క్రమక్రమంగా కేటీఆర్ కి ఒక్కొక్క దారి క్లియర్ చేసుకుంటూ వచ్చారు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి సగం పని పూర్తి చేశారు. ఇక మిగిలుంది కేటీఆర్ కి సీఎం కుర్చీ అందివ్వడమే. దాదాపుగా ఇప్పుడు షాడో సీఎంగా ఉన్న తనయుడికి […]

కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి ముహూర్తం కుదిరిందా..?
X

కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ కి అన్నీ తానే అనే స్టేజ్ కి వచ్చేశారు ఆయన తనయుడు కేటీఆర్. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే.. కొడుక్కి పట్టాభిషేకం చేయాలనే ఆలోచన కేసీఆర్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే క్రమక్రమంగా కేటీఆర్ కి ఒక్కొక్క దారి క్లియర్ చేసుకుంటూ వచ్చారు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి సగం పని పూర్తి చేశారు. ఇక మిగిలుంది కేటీఆర్ కి సీఎం కుర్చీ అందివ్వడమే. దాదాపుగా ఇప్పుడు షాడో సీఎంగా ఉన్న తనయుడికి నేరుగా ఆ పదవి ఇవ్వడం పెద్ద పనేం కాదు, అలా కుర్చీ ఇచ్చేసినా అడ్డు తగిలేవారు, అలిగేవారు కూడా లేరు. కానీ ఎందుకో కేసీఆర్ ఆలోచిస్తున్నారు. తన హయాం ఇంకా మిగిలే ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకులు ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు దేశ రాజకీయాల్లో ఉన్నా.. కేసీఆర్ ఫుల్ ఫామ్ లో ఉండగానే ఆ పనిచేస్తారా అనేది అనుమానమే. అయితే కేటీఆర్ ని భావి ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో చాలామంది ప్రొజెక్ట్ చేస్తూ వస్తుండటం కాస్త ఆలోచించాల్సిన విషయం. మార్చి నాటికి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఇటీవలే సెలవిచ్చారు. తాజాగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా.. సీఎం పదవికి కేటీఆర్ అన్ని విధాల అర్హుడని తేల్చి చెప్పారు. త్వరలోనే ఆయన ఆ పదవి అందుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలను పార్టీ నాయకులెవరూ సమర్థించలేదు, అలాగని ఖండించలేదు. కేటీఆర్ పేరు కాకుండా ఇంకెవరి పేరు చెప్పినా వారి అంతు చూస్తారు కేసీఆర్. కొడుకు పేరుతో తనపై ఒత్తిడి తెచ్చినా ఆనందంగానే దాన్ని అనుభవిస్తారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ధైర్యం చేసి కేటీఆర్ సీఎం సాబ్ అనేస్తున్నారు.

ఇప్పుడే ఎందుకు.. ?
2018లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.. ఇంకో మూడేళ్ల కాలం నింపాదిగా పాలించే అవకాశం కేసీఆర్ కి ఉంది. అయితే జమిలి భూతం ఆయన్ని బాగా భయపెడుతోంది. ఓవైపు రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడం, అధికార టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు మొదలవడంతో కేసీఆర్ లో అంతర్మథనం మొదలైంది. ఇటీవల తెలంగాణలో భారీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు సహా అందరికీ జీతాలు పెంచడం, కేంద్రంతో కయ్యాన్ని పక్కనపెట్టి ఆయుష్మాన్ భారత్ అమలుకి సిద్ధపడటం, రైతు చట్టాలకి పరోక్ష మద్దతిస్తూ నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే.. కేసీఆర్ లో మార్పు స్పష్టమని తేలుతోంది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?
ఇప్పటికిప్పుడు కేసీఆర్ తాను అస్త్ర సన్యాసం చేసి, కొడుక్కి బాధ్యతలు అప్పగించినా తెలంగాణలో ఎవరూ ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఒకవేళ అది కుదరదని భావిస్తే.. సాధారణ ఎన్నికలు వచ్చినా, లేక కాస్త ముందుగా జమిలి ఎన్నికలు వచ్చినా అన్నిటికీ కొడుకుని సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా కేటీఆర్ ని ప్రొజెక్ట్ చేసి పార్టీని ఎన్నికల బరిలో నిలపాలనేది ఆయన ఆలోచన. అందుకు అనుగుణంగానే ఈ లీకులన్నీ అని తెలుస్తోంది. ఈ లీకుల వెనక కేసీఆర్ ఆలోచన ఉందా, లేక నాయకులే సొంతగా కేటీఆర్ పేరు తెరపైకి తెస్తున్నారా అనే విషయం అధికారికంగా తేలాల్సి ఉంది. ఇలాంటి వార్తలు బైటకొస్తున్నా… కేటీఆర్ మాత్రం తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతున్నారు. అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించారు.

First Published:  3 Jan 2021 11:49 AM IST
Next Story