Telugu Global
National

రాజస్థాన్ లో హై అలెర్ట్.. బర్డ్ ఫ్లూతో 252కాకులు మృతి

కొవిడ్ మరణ మృదంగం తగ్గుతుందనుకుంటున్న టైమ్ లో.. రాజస్థాన్ ని బర్డ్ ఫ్లూ భయం పట్టి పీడిస్తోంది. వారం రోజులుగా రాజస్థాన్ లో బర్డ్ ఫ్లూ వ్యాధితో వందల సంఖ్యలో కాకులు మృతి చెందుతున్నాయి. ప్రాథమిక పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్థారణ కావడంతో.. రాష్ట్రంలోని అన్ని కోళ్ల ఫారాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎక్కడైనా అనుమానాస్పదంగా కోళ్లు మృతి చెందితే సమాచారం దాచి పెట్టకుండా అధికారులకు తెలపాలని ఆదేశాలిచ్చారు. బర్డ్ ఫ్లూ వార్తల […]

రాజస్థాన్ లో హై అలెర్ట్.. బర్డ్ ఫ్లూతో 252కాకులు మృతి
X

కొవిడ్ మరణ మృదంగం తగ్గుతుందనుకుంటున్న టైమ్ లో.. రాజస్థాన్ ని బర్డ్ ఫ్లూ భయం పట్టి పీడిస్తోంది. వారం రోజులుగా రాజస్థాన్ లో బర్డ్ ఫ్లూ వ్యాధితో వందల సంఖ్యలో కాకులు మృతి చెందుతున్నాయి. ప్రాథమిక పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్థారణ కావడంతో.. రాష్ట్రంలోని అన్ని కోళ్ల ఫారాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఎక్కడైనా అనుమానాస్పదంగా కోళ్లు మృతి చెందితే సమాచారం దాచి పెట్టకుండా అధికారులకు తెలపాలని ఆదేశాలిచ్చారు. బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో రాజస్థాన్ లో చికెన్ వ్యాపారం సగానికి సగం పడిపోయింది.

డిసెంబర్ 25న జల్వార్ ప్రాంతంలో మూకుమ్మడిగా కాకులు చనిపోవడాన్ని గుర్తించారు. ఆ తర్వాత రెండోరోజే ఆ సంఖ్య 100కి పెరిగింది. బరాన్ ప్రాంతంలో 72, కోట ప్రాంతంలో 47, పాలిలో 19, జోథ్ పూర్ లో 7 కాకులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయి. దీంతో శాంపిల్స్ ని భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ సంస్థకు పంపించారు అధికారులు. వ్యాధి నిర్థారణ పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూగా నిర్థారించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.
రాజస్థాన్ పశు సంవర్థక శాఖ ప్రధాన కార్యదర్శి కుంజీలాల్ మీనా ఈమేరకు అధికారిక ఆదేశాలు విడుదల చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. సాంబార్ సరస్సుపై నిఘా పెట్టారు, కైలాదేవి బర్డ్ శాంక్చువరీలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. పెంపుడు జంతువులు, పక్షులలోకి ఈ వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా పశువులు, పక్షులు చనిపోతే.. వెంటనే వాటిని తీసుకెళ్లి కాల్చేయాలని సూచిస్తున్నారు. రాజస్థాన్ లోని అన్ని జిల్లాల్లోనూ అధికారులను అప్రమత్తం చేశారు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ‌లోని ప్రాంగ్ చిత్తడి నేతలలో బాతుల జాతికి చెందిన బార్ హెడెడె గూస్ మరణంపై కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వారం రోజుల్లో సుమారు వెయ్యికి పైగా బార్ హెడెడ్ గూస్ అక్కడ చనిపోయి కనిపించాయి. చనిపోవడానికి ముందు అవి వింతగా ప్రవర్తించాయని స్థానికులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ మరణాలకు విషాహారం కాదని తేల్చి చెబుతున్న అధికారులు, మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతానికి హిమాచల్ ప్రదేశ్ ఘటనలో బర్డ్ ఫ్లూ వంటి అనుమానాలు తలెత్తలేదు. అయితే రాజస్థాన్ వ్యవహారంలో బర్డ్ ఫ్లూ కన్ఫామ్ కావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.

First Published:  3 Jan 2021 4:00 PM IST
Next Story