క్రిష్ కు కరోనా
ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇంతకీ క్రిష్ కు కరోనా ఉందనే విషయం ఎలా తెలిసిందో తెలుసా? మరో 2 రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ పెట్టుకున్నాడు క్రిష్. దానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం, అందరితో పాటు క్రిష్ కూడా కరోనా టెస్ట్ […]

ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్
అని తేలింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇంతకీ క్రిష్ కు కరోనా
ఉందనే విషయం ఎలా తెలిసిందో తెలుసా?
మరో 2 రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ పెట్టుకున్నాడు క్రిష్. దానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం, అందరితో పాటు క్రిష్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అది పాజిటివ్ గా తేలింది. తనకు పాజిటివ్ వచ్చినంతవరకు కరోనా ఉందేన విషయం క్రిష్ కు తెలియలేదు. అతడికి ఎలాంటి లక్షణాల్లేవ్.
ఇప్పటికే టాలీవుడ్ లో రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా బారినపడ్డారు. అంతకంటే ముందు రకుల్, తమన్న కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి క్రిష్ కూడా చేరిపోయాడు.