గోవాలో రష్మిక సంబరాలు
లాక్ డౌన్ తర్వాత ఆల్రెడీ ఓసారి గోవా వెళ్లొచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక. ఇప్పుడు మరోసారి ఆమె గోవా చెక్కేసింది. నూతన సంవత్సర వేడుకల్ని ఆమె గోవాలో సెలబ్రేట్ చేసుకోబోతోంది. ఇప్పటికే ఆమె హంగామా మొదలుపెట్టేసింది. ఆమె గోవా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నూతన సంవత్సర వేడుకలు అనగానే తారలంతా విదేశాలు చుట్టేస్తుంటారు. ఎక్కువమంది న్యూయార్క్ వెళ్తారు. దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్, పారిస్ వెళ్లే జనాలు కూడా ఎక్కువే. కానీ ఈసారి కరోనా […]
లాక్ డౌన్ తర్వాత ఆల్రెడీ ఓసారి గోవా వెళ్లొచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక. ఇప్పుడు మరోసారి ఆమె గోవా చెక్కేసింది. నూతన సంవత్సర వేడుకల్ని ఆమె గోవాలో సెలబ్రేట్ చేసుకోబోతోంది. ఇప్పటికే ఆమె హంగామా మొదలుపెట్టేసింది. ఆమె గోవా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి నూతన సంవత్సర వేడుకలు అనగానే తారలంతా విదేశాలు చుట్టేస్తుంటారు. ఎక్కువమంది న్యూయార్క్ వెళ్తారు. దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్, పారిస్ వెళ్లే జనాలు కూడా ఎక్కువే. కానీ ఈసారి కరోనా వీళ్ల ప్లాన్స్ ను తుంచేసింది. అందుకే చాలామంది సెలబ్రిటీలు గోవాకే ఫిక్స్ అయ్యారు. రష్మిక కూడా గోవాకే వెళ్లింది.
నూతన సంవత్సర వేడుకలు పూర్తయిన వెంటనే ఓ బాలీవుడ్ సినిమాలో జాయిన్ అవ్వబోతోంది రష్మిక. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను అనే సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలక్ట్ అయింది. అలా 2021లో రష్మిక కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టబోతోంది.