Telugu Global
Cinema & Entertainment

రంగ్ దే రిలీజ్ డేట్

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా గతంలో ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అవ్వడంతో, ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ మూవీని జనవరి 23 లేదా మార్చి 26న రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఆ రెండు తేదీలు సినిమా విడుదలకు అనుకూలమైనవి. లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. […]

Rang De
X

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా గతంలో ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అవ్వడంతో, ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.

ఈ మూవీని జనవరి 23 లేదా మార్చి 26న రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఆ రెండు తేదీలు సినిమా విడుదలకు అనుకూలమైనవి. లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. దీంతో చాలామంది జనవరి 23నే రంగ్ దే వస్తుందని భావించారు. కానీ మేకర్స్ మాత్రం మార్చి 26కు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ దక్కించుకోవడమే కాకుండా.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి థియేట్రికల్ రిలీజ్ లో కూడా భాగస్వామ్యం కానుంది. తాజాగా ఈ సంస్థ, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను ఇదే పద్ధతిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

First Published:  31 Dec 2020 12:16 PM IST
Next Story