డబ్బింగ్ స్టార్ట్ చేసిన రవితేజ
క్రాక్ సినిమా తుది ఘట్టానికి చేరుకుంది. ఈ మూవీకి సంబంధించి తాజాగా డబ్బింగ్ వర్క్ మొదలైంది. రవితేజ తన క్యారెక్టర్ కు డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. వీటికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోవాలో ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ షెడ్యూల్ ను రీసెంట్ గా పూర్తిచేశారు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇప్పుడు డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. మరోవైపు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కూడా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో క్రాక్ […]
క్రాక్ సినిమా తుది ఘట్టానికి చేరుకుంది. ఈ మూవీకి సంబంధించి తాజాగా డబ్బింగ్ వర్క్ మొదలైంది.
రవితేజ తన క్యారెక్టర్ కు డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. వీటికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి.
గోవాలో ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ షెడ్యూల్ ను రీసెంట్ గా పూర్తిచేశారు. కొన్ని రోజులు గ్యాప్
తీసుకొని ఇప్పుడు డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. మరోవైపు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కూడా
సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో క్రాక్ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని సమాచారం.
రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో మాస్
రాజా కనిపించబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం
అందిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్
రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.