Telugu Global
Cinema & Entertainment

రాధేశ్యామ్ పై క్లారిటీ వచ్చేసింది

ఏడాదికిపైగా నలుగుతున్న సినిమా. ఇది పూర్తయితే తప్ప, మరో సినిమా స్టార్ట్ చేయలేని పరిస్థితి. లాక్ డౌన్ ప్రభావంతో చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న సినిమా. అదే రాధేశ్యామ్. ఎట్టకేలకు ఈ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని ప్రకటించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. నిజానికి ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజులు ఆలస్యం అవ్వాలి. ఎందుకంటే, […]

pooja hegde radhe shyam
X

ఏడాదికిపైగా నలుగుతున్న సినిమా. ఇది పూర్తయితే తప్ప, మరో సినిమా స్టార్ట్ చేయలేని పరిస్థితి. లాక్ డౌన్ ప్రభావంతో చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న సినిమా. అదే రాధేశ్యామ్. ఎట్టకేలకు ఈ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది.

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని ప్రకటించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. నిజానికి ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజులు ఆలస్యం అవ్వాలి. ఎందుకంటే, రాధేశ్యామ్ కోసం పూజా హెగ్డే కేటాయించిన కాల్షీట్లు అయిపోయాయి. ఆమె వెంటనే ఓ బాలీవుడ్ సినిమాకు షిఫ్ట్ అవ్వాలి.

కానీ రాధేశ్యామ్ కోసం పూజా హెగ్డే తన కాల్షీట్లలో మార్పులు చేసింది. బాలీవుడ్ ప్రాజెక్టును మరో 2 వారాలు ఆలస్యం చేసి, ఆ కాల్షీట్లను రాధేశ్యామ్ కు కేటాయించింది. దీంతో జనవరి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ఉంది. జనవరి చివరినాటికి షూటింగ్ పూర్తయితే, ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చేస్తానంటున్నాడు దర్శకుడు.

First Published:  30 Dec 2020 4:51 AM IST
Next Story