ఇద్దరు మెగా హీరోలకు ఒకేసారి కరోనా
ఈరోజు ఉదయాన్నే షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు రామ్ చరణ్. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని ఆయన స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆచార్య షూట్ లో కూడా చేరబోతున్నాడు. అంతలోనే కరోనా బారిన పడ్డాడు. రామ్ చరణ్ కు ఎక్కడ, ఎలా కరోనా సోకిందనే విషయం అంతుచిక్కకుండా ఉంది. రీసెంట్ గా ఆయన ఆచార్య సెట్స్ ను సందర్శించాడు. అంతకంటే ముందు […]
ఈరోజు ఉదయాన్నే షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు రామ్ చరణ్. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని ఆయన స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆచార్య షూట్ లో కూడా చేరబోతున్నాడు. అంతలోనే కరోనా బారిన పడ్డాడు.
రామ్ చరణ్ కు ఎక్కడ, ఎలా కరోనా సోకిందనే విషయం అంతుచిక్కకుండా ఉంది. రీసెంట్ గా ఆయన ఆచార్య సెట్స్ ను సందర్శించాడు. అంతకంటే ముందు మెగాకాంపౌండ్ కుటుంబసభ్యులందరితో కలిసి క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు.
రామ్ చరణ్ ప్రకటించిన కొద్దిసేపటికే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా సోకిందనే విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం తను కూడా హోం క్వారంటైన్ లో ఉన్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తానని చెబుతున్నాడు.
తనకు ఎలాంటి కరోనా లక్షణాల్లేవని రామ్ చరణ్ ప్రకటించాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఓ మోస్తరుగా కరోనా లక్షణాలున్నట్టు తెలిపాడు. ఒకేసారి ఇద్దరు మెగా హీరోలు కరోనా బారిన పడ్డంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.