Telugu Global
Health & Life Style

బ్రౌన్ రైస్... వైట్ రైస్... ఏది తినాలి?

మనం రోజూ తినే రైస్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ‘ఒబెసిటీ, షుగర్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌ను మానేయాలి’ అని కొంతమంది.. ‘వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిద’ని మరికొంతమంది చెప్తుంటారు. ఇకపోతే.. మార్కెట్లో వైట్ రైస్, బ్రౌన్ రైస్‌తో పాటు, రెడ్ రైస్, బ్లాక్ రైస్.. అంటూ రకరకాల వెరైటీలున్నాయి. ఇంతకీ ఈ రైస్‌ల సంగతేంటి? ఏ రైస్‌లో ఏయే పోషకాలుంటాయి? ఎప్పటినుంచో అందరూ కామన్‌గా తింటూ వచ్చింది వైట్ […]

బ్రౌన్ రైస్... వైట్ రైస్... ఏది తినాలి?
X

మనం రోజూ తినే రైస్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ‘ఒబెసిటీ, షుగర్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌ను మానేయాలి’ అని కొంతమంది.. ‘వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిద’ని మరికొంతమంది చెప్తుంటారు. ఇకపోతే.. మార్కెట్లో వైట్ రైస్, బ్రౌన్ రైస్‌తో పాటు, రెడ్ రైస్, బ్లాక్ రైస్.. అంటూ రకరకాల వెరైటీలున్నాయి. ఇంతకీ ఈ రైస్‌ల సంగతేంటి? ఏ రైస్‌లో ఏయే పోషకాలుంటాయి?

ఎప్పటినుంచో అందరూ కామన్‌గా తింటూ వచ్చింది వైట్ రైస్‌నే. అయితే ఈ వైట్ రైస్‌ను మరీ తెల్లగా మెరిసిపోయే వరకూ పాలిష్ చేసి, అందులో ఉండే పోషకాలన్నీ పూర్తిగా పోయేలా తయారుచేస్తున్నారు. దానివల్ల అందులో కేవలం షుగర్ కంటెంట్ మాత్రమే మిగులుతుంది. దాంతో ఇందులో పోషకాలేవీ మిగలట్లేదు.

అయితే.. ఈ వైట్ రైస్‌లో పోషకాల మాటేమో కానీ.. శక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే స్టార్చ్ వలన ఈ రైస్ ఇతర రైస్‌ల కన్నా ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. కానీ ఒబెసిటీ, షుగర్ సమస్యలున్నవారికి ఇది సమస్యగా మారడంతో.. ప్రస్తుతం చాలామంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్ తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. ఈ రైస్ తినడం వల్ల షుగ‌ర్‌, అధిక బ‌రువు అదుపులో ఉంటాయని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.

బ్రౌన్ రైస్ అసలు ఎలా మంచిదంటే…

కేవ‌లం ఒక్కసారి మాత్రమే పాలిష్ వేసిన బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇవి గోధుమ రంగులో ఉంటాయి. ఈ బియ్యం ఉడికేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అలాగే ఈ రైస్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల అంత త్వర‌గా జీర్ణమ‌వ్వదు. అందుకే బ్రౌన్ రైస్ కొద్దిగా తిన్నా క‌డుపు నిండినట్టు అనిపిస్తుంది.

అలాగే ఈ అన్నం అరిగేందుకు కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా అమాంతం పెర‌గ‌వు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అందుకే షుగ‌ర్ ఉన్నవాళ్లు బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తారు.

పోషకాల గని పోష‌కాల విష‌యానికొస్తే బ్రౌన్ రైస్‌లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. మాంగనీస్, సెలెనియం, నేచురల్ ఆయిల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అధిక బరువును తగ్గించి, షుగర్ ను అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఒక కప్పు బ్రౌన్ రైస్ లో 45 గ్రా. కార్బోహైడ్రేట్స్, 1.8గ్రా ప్రొటీన్, 3.5 గ్రా ఫైబర్.. వీటితో పాటు కొన్ని మిల్లీ గ్రాముల విటమిన్ B6, థయామిన్, జింక్, ఐరన్ కూడా ఉంటాయి. కొన్ని స్టడీల ప్రకారం రెగ్యులర్‌‌గా ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ అరవై శాతం తగ్గుతుందట.

ఇక వీటితోపాటు బ్రౌన్ రైస్‌లో ఆర్సెనిక్ అనే విష ప‌దార్థం కూడా ఉంటుంది. అది చాలా త‌క్కువ మోతాదులోనే ఉంటుంది. అందుకే బ్రౌన్ రైస్‌ను రోజుకు ఒక‌సారి మాత్రమే తీసుకుంటే బెట‌ర్‌. బ్రౌన్ రైస్‌లో మీడియం గ్రెయిన్, షార్ట్ గ్రెయిన్, బ్రౌన్ కలర్డ్ రైస్, లాంగ్ బ్రౌన్ రైస్ అని నాలుగురకాలున్నాయి. వీటిలో మీడియం గ్రెయిన్ బ్రౌన్ రైస్ బెస్ట్ ఆప్షన్.

రెడ్ రైస్…

ఈ రైస్‌కి అందులో ఉండే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఆ రంగు వస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ రైస్ ఇంఫ్లమేషన్‌ని రెడ్యూస్ చేస్తుందనీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందనీ, బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందని చెప్తారు. ఇది అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, కాబట్టి త్వరగా ఆకలిగా అనిపించదు.

బ్లాక్ రైస్…

దీన్ని ఫర్‌‌బిడెన్ రైస్ అని కూడా అంటారు. ఈ రైస్‌కి కూడా కొన్ని ప్రత్యేకమయిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రైస్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్, ఫైటో కెమికల్స్, విటమిన్ E , ప్రోటీన్, ఐరన్ ఉన్నాయి.

పైగా, ఈ రైస్ క్యాన్సర్ రిస్క్‌ని కూడా తగ్గిస్తుందని చెప్తారు. ఈ రైస్ ఉడకకముందు బ్లాక్‌గా, ఉడికాక కొద్దిగా పర్పుల్ కలర్‌‌లోకి వస్తుంది.

First Published:  21 Dec 2020 9:00 AM IST
Next Story