Telugu Global
National

అమూల్‌ రాకతో ఏపీ పాడి రైతుకు మేలు జరిగిందా?

ఏపీలో అమూల్‌ ఎంటరైంది. ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9,899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఉంటాయి. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ ప్రారంభించనున్నారు. ఏ ఉద్దేశంతో అమూల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ ఉద్దేశం నెరవేరినట్లే కనిపిస్తోంది. అమూల్‌ రాకతో పాడి రైతులకు ఐదు నుంచి ఏడు రూపాయల అధిక ఆదాయం వస్తుందని […]

అమూల్‌ రాకతో ఏపీ పాడి రైతుకు మేలు జరిగిందా?
X

ఏపీలో అమూల్‌ ఎంటరైంది. ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9,899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఉంటాయి. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ ప్రారంభించనున్నారు. ఏ ఉద్దేశంతో అమూల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ ఉద్దేశం నెరవేరినట్లే కనిపిస్తోంది. అమూల్‌ రాకతో పాడి రైతులకు ఐదు నుంచి ఏడు రూపాయల అధిక ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అనుకున్నట్లుగానే అమూల్‌ రాకతో ఇప్పుడు ప్రైవేటు పాల సేకరణ కంపెనీలు కూడా రేట్లు పెంచాయి.

హెరిటేజ్‌, సంగం డెయిరీ లాంటి కంపెనీలు నిన్నటివరకూ లీటర్‌కు కేవలం 42 రూపాయలు మాత్రమే ఇచ్చేవి. కానీ అమూల్‌ రాకతో ఇప్పుడు కంపెనీలు రేట్లు పెంచేశాయి. సంగం డెయిరీపై అమూల్‌ ఎఫెక్ట్‌ బాగానే పడింది. లీటర్‌కి 45 రూపాయల దాకా ఇస్తామని రైతులకు సంగం డెయిరీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇటు హెరిటేజ్‌ కూడా ఆఫర్లు ప్రకటించింది. నెల రోజుల మూడు రోజుల పాటు పాలు కొంటే… మూడు రోజులు పాలు ఫ్రీ అని ప్రకటించింది. మరోవైపు కిలో నెయ్యి కొంటే మరో కిలో నెయ్యి ఫ్రీ అని ఇస్తోంది.

మొత్తానికి అమూల్‌ రాకతో రైతులకు లాభం చేకూరింది. ఇటు వినియోగదారులకు మేలు జరుగుతోంది. ఇన్నాళ్లు గుత్తాధిపత్యంతో చెలరేగిన పాల కంపెనీలు ఇప్పుడు దిగివస్తున్నాయి.

మరోవైపు అమూల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను తదుపరి బోనస్ గా రైతులకు చెల్లిస్తుంది. సహకార రంగంలో ఏర్పాటైన అమూల్ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోంది. అమూల్ రావటంతో ఏపీలో పాలసహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చు. దశలవారీగా రూ.6,551కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం అని సీఎం జగన్ ప్రకటించారు.

First Published:  14 Dec 2020 4:06 AM IST
Next Story