జస్టిస్ రమణపై ఆరోపణలు తీవ్రమైనవి... విచారణ జరిపించాలి " జస్టిస్ ఏకే గంగూలి
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలి. ఒక పత్రికతో మాట్లాడిన ఆయన… రమణపై వచ్చినవి తీవ్రమైన ఆరోపణలు అని వ్యాఖ్యానించారు. ఆరోపణల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. లేఖ రాసింది ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి అని… కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరగాలని, ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. […]
![జస్టిస్ రమణపై ఆరోపణలు తీవ్రమైనవి... విచారణ జరిపించాలి జస్టిస్ ఏకే గంగూలి జస్టిస్ రమణపై ఆరోపణలు తీవ్రమైనవి... విచారణ జరిపించాలి జస్టిస్ ఏకే గంగూలి](https://www.teluguglobal.com/h-upload/old_images/116499-justice-ak-ganguly-on-n-v-ramana-issue-ys-jagan-letter.webp)
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలి. ఒక పత్రికతో మాట్లాడిన ఆయన… రమణపై వచ్చినవి తీవ్రమైన ఆరోపణలు అని వ్యాఖ్యానించారు. ఆరోపణల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు.
లేఖ రాసింది ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి అని… కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరగాలని, ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మౌనంగా ఉంటారని తాను భావించడం లేదన్నారు. న్యాయవ్యవస్థలో పూర్తి పారదర్శకత అవసరమని…. కాబట్టి విచారణ జరగాలని కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలు ఈ వ్యవహారంలో ఉన్నందున ఆరోపణలపై దర్యాప్తు జరగాలన్నారు. ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. న్యాయవ్యవస్థ అన్నది పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్ అని… ఇందులో ఉన్న సిట్టింగ్ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తులు కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములేనన్నారు.