నవంబర్ 9న 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
రాజ్యసభలో ఖాళీగా ఉన్న 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ కూడా జరిపి ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. నవంబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు […]
రాజ్యసభలో ఖాళీగా ఉన్న 11 స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ కూడా జరిపి ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నారు.
నవంబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఈ 11 స్థానాల్లో 10 స్థానాలు ఉత్తప్రదేశ్, ఒక స్థానం ఉత్తరాఖండ్‌కు చెందినవి. కరోనా నిబంధనలు అనుసరించి ఎన్నికలు జరుగుతాయని.. కరోనా నిబంధనల అమలుకోసం రెండు రాష్ట్రాలకు ఇద్దరు అధికారులను నియమించాలని ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలకు సంబంధించి ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలని, హాల్ ఎంట్రి దగ్గర థర్మల్ స్కానింగ్ నిర్వహించనున్నట్టు, అన్ని చోట్లా శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నట్టు వివరించింది.