Telugu Global
Health & Life Style

కాస్త కోవిడ్ లోడ్ ఎక్కించుకుంటే .... మంచిదా?!

ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండటం వలన కరోనా రాకుండా నివారించగలం… అనేది అందరికీ తెలిసిన సూత్రమే. అయితే కాస్త వైరస్ లోడ్ లోపలికి వెళితేనే మంచిదని రోగనిరోధక శక్తి పెరుగుతుందని కూడా చాలామంది భావిస్తున్నారు. దీనినే హెర్డ్ ఇమ్యునిటీ అంటున్నాం. కాన్పూర్ ఐఐటి 1980కి చెందిన పూర్వ విద్యార్థులు 150 మంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. వాళ్లు ఇప్పుడు ఈ పద్ధతినే పాటిస్తున్నారు కూడా.  చాలా తక్కువ మోతాదులో రోగకారక క్రిములు మన శరీరంలోకి […]

కాస్త కోవిడ్ లోడ్ ఎక్కించుకుంటే .... మంచిదా?!
X

ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండటం వలన కరోనా రాకుండా నివారించగలం… అనేది అందరికీ తెలిసిన సూత్రమే. అయితే కాస్త వైరస్ లోడ్ లోపలికి వెళితేనే మంచిదని రోగనిరోధక శక్తి పెరుగుతుందని కూడా చాలామంది భావిస్తున్నారు. దీనినే హెర్డ్ ఇమ్యునిటీ అంటున్నాం. కాన్పూర్ ఐఐటి 1980కి చెందిన పూర్వ విద్యార్థులు 150 మంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. వాళ్లు ఇప్పుడు ఈ పద్ధతినే పాటిస్తున్నారు కూడా. చాలా తక్కువ మోతాదులో రోగకారక క్రిములు మన శరీరంలోకి చేరేలా చూసుకుంటే భవిష్యత్తులో వైరస్ కి గురయినా మన రోగనిరోధక వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఈ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు.

భిన్నదేశాల్లో ఉన్న ఈ పూర్వ విద్యార్థుల బృందం ఈ విషయంపైన తమలో తాము చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు కానీ, వైరస్ ని నివారించే షీల్డులను కానీ ముఖానికి ధరించి యధాతథంగా తమ పనులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. క్వారంటైన్ లో ఉండటం వలన మన రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని ఈ బృందంలో ఒకరైన మోహన్ తాంబే అన్నారు. ‘మన రోగనిరోధక వ్యవస్థకు కావాల్సింది మందులు, మూలికలు కాదు… దానికి సవాళ్లు కావాలి. గాల్లో ఉన్న రోగనిరోధక క్రిములతో పోరాటం చేసి అది తనను తాను మరింత బలంగా మార్చుకోవాలి. ఒంటరిగా ఉండటం వలన మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.’ అని మోహన్ వివరించారు.

మాస్కులను ధరించడం వలన వైరస్ మనలో ఎక్కువ స్థాయిలో చేరదు. తక్కువ మోతాదులో శరీరంలో వైరస్ ఉన్నపుడు మన రోగనిరోధక వ్యవస్థ సమర్ధవంతంగా దానిని ఎదుర్కొంటుంది. వ్యాక్సిన్ల ద్వారా కూడా తక్కువ మోతాదులో, రోగనిరోధక వ్యవస్థ తట్టుకునే స్థాయిలో వైరస్ ని శరీరంలోకి పంపుతారు. మేము చేస్తున్నది కూడా అదే. కాకపోతే సహజపద్ధతిలో వ్యాక్సిన్ తీసుకుంటున్నామని భావించవచ్చని… మోహన్ తాంబే తెలిపారు.

First Published:  26 Sept 2020 2:58 PM IST
Next Story