ఇది లౌకిక రాష్ట్రమేనా?... జగన్ సర్కార్‌పై మరోసారి హైకోర్టు ఫైర్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజాగా గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో విచారణను ఉపసంహరించుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కోసం జీవో ఇచ్చినట్టుగా లేదని… కేవలం రాజకీయ లబ్ది కోసమే జీవో ఇచ్చినట్టుగా ఉందని మండిపడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది. జీవోలో ముస్లిం యువకులపై కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రచురించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. జీవోలో ముస్లిం యూత్ అని ఎలా ప్రస్తావిస్తారంటూ […]
![ఇది లౌకిక రాష్ట్రమేనా?... జగన్ సర్కార్‌పై మరోసారి హైకోర్టు ఫైర్ ఇది లౌకిక రాష్ట్రమేనా?... జగన్ సర్కార్‌పై మరోసారి హైకోర్టు ఫైర్](https://www.teluguglobal.com/h-upload/old_images/116684-high-court-serious-on-jagan-government-guntur-police-station-case.webp)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజాగా గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో విచారణను ఉపసంహరించుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కోసం జీవో ఇచ్చినట్టుగా లేదని… కేవలం రాజకీయ లబ్ది కోసమే జీవో ఇచ్చినట్టుగా ఉందని మండిపడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది.
జీవోలో ముస్లిం యువకులపై కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రచురించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. జీవోలో ముస్లిం యూత్ అని ఎలా ప్రస్తావిస్తారంటూ ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగేనా అంటూ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె. ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జీవోలో ముస్లిం యూత్ అని ఎందుకు చేర్చాల్సి వచ్చిందో ప్రభుత్వ తరపు న్యాయవాది మహేశ్వర్ రెడ్డి కోర్టుకు వివరించారు. గత ప్రభుత్వంలో కేసు నమోదు సమయంలోనే ఎఫ్‌ఐఆర్‌లో ముస్లిం యూత్ అని చేర్చారని… దాంతో ఇప్పుడు ఇచ్చిన జీవోలో కూడా ఆ పదాన్ని వాడాల్సి వచ్చిందని వివరించారు.