Telugu Global
National

డ్రగ్స్‌ కేసులో నమ్రతా శిరోద్కర్ ‌- జాతీయ మీడియా

ముంబై డ్రగ్స్ కేసు టాలీవుడ్‌నూ కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియా చక్రవర్తి అరెస్ట్‌ తర్వాత ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు హీరో మహేష్‌ బాబు భార్య నమ్రతా పేరును కూడా జాతీయ మీడియా ప్రస్తావించింది. నమ్రతా… టాలెంట్ మేనేజర్‌ జయ సాహాతో చాటింగ్‌ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ”బాంబేలో మంచి ఎండీ ఇస్తానని ప్రామిస్ చేశావ్.. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం” అంటూ నమ్రత చాటింగ్ చేసినట్టు మీడియాలో కథనాలు […]

డ్రగ్స్‌ కేసులో నమ్రతా శిరోద్కర్ ‌- జాతీయ మీడియా
X

ముంబై డ్రగ్స్ కేసు టాలీవుడ్‌నూ కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియా చక్రవర్తి అరెస్ట్‌ తర్వాత ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు హీరో మహేష్‌ బాబు భార్య నమ్రతా పేరును కూడా జాతీయ మీడియా ప్రస్తావించింది. నమ్రతా… టాలెంట్ మేనేజర్‌ జయ సాహాతో చాటింగ్‌ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

”బాంబేలో మంచి ఎండీ ఇస్తానని ప్రామిస్ చేశావ్.. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం” అంటూ నమ్రత చాటింగ్ చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్‌సీబీ విచారణ సమయంలో నమ్రతా పేరు బయటకు వచ్చింది. డ్రగ్స్ సరఫరా చేసినట్టు జయ సాహో వాంగ్మూలం ఇచ్చారు. ఎన్‌సీబీ ట్రాకింగ్‌లో జయ సాహో, నమ్రత చాటింగ్‌ బయటపడింది.

First Published:  22 Sept 2020 12:07 PM IST
Next Story