Telugu Global
National

వైసీపీలో చేరిన వాసుపల్లి కుమారులు

విశాఖ దక్షిణ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆయన వైసీపీ కండువా వేసుకోలేదు. తన కుమారులను మాత్రం నేరుగా వైసీపీలో చేర్పించారు. తన కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇకముందు తెలుగుదేశం పార్టీ పుంజుకుని ముందుకు వస్తుందని తనకు అనిపించడం లేదన్నారు. టీడీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో 23 […]

వైసీపీలో చేరిన వాసుపల్లి కుమారులు
X

విశాఖ దక్షిణ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆయన వైసీపీ కండువా వేసుకోలేదు. తన కుమారులను మాత్రం నేరుగా వైసీపీలో చేర్పించారు. తన కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.

విశాఖను పరిపాలన రాజధానిగా చేసిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇకముందు తెలుగుదేశం పార్టీ పుంజుకుని ముందుకు వస్తుందని తనకు అనిపించడం లేదన్నారు.

టీడీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఇప్పటికే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు టీడీపీని వీడారు. 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం పది శాతం మంది సభ్యులుండాలి. అంటే 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఇప్పుడు వాసుపల్లి గణేష్‌ కూడా టీడీపీని వీడడంతో తెలుగుదేశం పార్టీ బలం 19కి పడిపోయింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను చంద్రబాబు వదులుకోవాల్సి ఉంటుంది.

First Published:  19 Sept 2020 10:21 AM IST
Next Story