Telugu Global
National

రమేష్‌ ఆస్పత్రికి, గరికపాటికి హైకోర్టు భారీ ఊరట

హైకోర్టులో టీడీపీ సానుభూతిపరుడు, డాక్టర్‌ రమేష్‌బాబుకు చెందిన రమేష్‌ ఆస్పత్రికి మరో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో 10 మంది చావుకు కారణం అవడంతో పాటు కరోనా వైద్యం పేరుతో భారీగా ఫీజులు వసూలు చేసినందుకు గాను.. ఆస్పత్రి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కొద్దిరోజుల క్రితం అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ రమేష్ ఆస్పత్రి హైకోర్టును ఆశ్రయించగా… వారి తరపున టీడీపీ […]

రమేష్‌ ఆస్పత్రికి, గరికపాటికి హైకోర్టు భారీ ఊరట
X

హైకోర్టులో టీడీపీ సానుభూతిపరుడు, డాక్టర్‌ రమేష్‌బాబుకు చెందిన రమేష్‌ ఆస్పత్రికి మరో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో 10 మంది చావుకు కారణం అవడంతో పాటు కరోనా వైద్యం పేరుతో భారీగా ఫీజులు వసూలు చేసినందుకు గాను.. ఆస్పత్రి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కొద్దిరోజుల క్రితం అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది.

ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ రమేష్ ఆస్పత్రి హైకోర్టును ఆశ్రయించగా… వారి తరపున టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అధిక ఫీజులు వసూలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దాంతో హైకోర్టు రమేష్ ఆస్పత్రికి ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది.

అటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గరికపాటికి చెందిన గ్రానైట్ కంపెనీకి అధికారులు విధించిన 217 కోట్ల జరిమానాను నిలిపివేస్తూ జస్టిస్ రజని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

First Published:  3 Sept 2020 3:43 AM IST
Next Story