పారదర్శకంగా టాయ్ లెట్లు... అమ్మో అనకండి !
గాజు గోడలతో లోపల ఉన్నదంతా బయటకు కనిపించే గదులు చూసేందుకు అందంగా ఉంటాయి. షాపింగ్ మాల్స్, ఆఫీసుల్లో ఇలాంటి గదులు కనబడుతుంటాయి. అయితే పారదర్శకంగా లోపలంతా కనిపించేలా టాయ్ లెట్లు ఉంటే…ఇంత బుద్దిలేకుండా ఇలా ఎలా కట్టారు అనిపిస్తుంది కదా. అయితే జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న యొయోగీ ఫుకమాచి మినీ పార్క్, హరునో ఒగావా కమ్యునిటీ పార్కుల్లో ఇలాంటి టాయ్ లెట్లే ఉన్నాయి. షిగేరు బాన్ అనే ఆర్కిటెక్ట్ పారదర్శకమైన గ్లాస్ తో వీటిని డిజైన్ […]
గాజు గోడలతో లోపల ఉన్నదంతా బయటకు కనిపించే గదులు చూసేందుకు అందంగా ఉంటాయి. షాపింగ్ మాల్స్, ఆఫీసుల్లో ఇలాంటి గదులు కనబడుతుంటాయి. అయితే పారదర్శకంగా లోపలంతా కనిపించేలా టాయ్ లెట్లు ఉంటే…ఇంత బుద్దిలేకుండా ఇలా ఎలా కట్టారు అనిపిస్తుంది కదా.
అయితే జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న యొయోగీ ఫుకమాచి మినీ పార్క్, హరునో ఒగావా కమ్యునిటీ పార్కుల్లో ఇలాంటి టాయ్ లెట్లే ఉన్నాయి. షిగేరు బాన్ అనే ఆర్కిటెక్ట్ పారదర్శకమైన గ్లాస్ తో వీటిని డిజైన్ చేశాడు. అంటే లోపల అంతా చాలా స్పష్టంగా కనబడుతుంది. లోపల శుభ్రంగా ఉందాలేదా, ఎవరన్నా ఉన్నారా అనేది తెలుసుకోవాలంటే తలుపులు తీసి చూడాల్సిన పనిలేదు. బయటనుండే కనబడుతుంటుంది.
టాయ్ లెట్లు అలా పారదర్శకంగా ఉంటే మరి వాటిని వాడటం ఎలా అంటారా…. ఇక్కడే ఒక మెలిక ఉంది. ఎవరైనా లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నపుడు ఆ గాజు గోడల్లోంచి లోపల ఉన్నది బయటకేమీ కనిపించదు. బయటవైపు గాజు గోడలకున్న పారదర్శక గుణం పోతుంది. అంతేకాదు… రాత్రివేళ ఇవి వెలుగులను విరజిమ్ముతుంటాయి కూడా. ఇలాంటి సరికొత్త సాంకేతిక విజ్ఞానంతో వీటిని నిర్మించారు. ది టోక్యో టాయ్ లెట్ అనే వెబ్ సైట్లో ఈ వివరాలు ఇచ్చారు.
టోక్యోలోని షిబుయా అనే ప్రాంతంలో ఉన్న 17 టాయ్ లెట్లను ఇలా సరికొత్తగా మార్చనున్నారు. పారదర్శక టాయ్ లెట్ల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.