Telugu Global
International

బీజేపీ గుప్పెట్లో ఫేస్‌బుక్ ‌- వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం

మీడియా సంస్థలు రాజకీయ పార్టీల గుప్పట్లో ఉండడం ఇప్పటి వరకు చూశాం. అయితే సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కూడా రాజకీయ రంగేసుకుందని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇండియాలో ఫేస్‌బుక్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫేస్‌బుక్ ఇండియా ఉన్నతాధికారి అంకిత్ దాస్ బీజేపీని తన భుజాలపై మోస్తున్నారని వాల్‌స్ట్రీట్ ప్రచురించింది. బీజేపీ నేతల పేజీల్లో అత్యంత వివాదాస్పద అంశాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నా సరే ఫేస్‌బుక్ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం […]

బీజేపీ గుప్పెట్లో ఫేస్‌బుక్ ‌- వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
X

మీడియా సంస్థలు రాజకీయ పార్టీల గుప్పట్లో ఉండడం ఇప్పటి వరకు చూశాం. అయితే సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కూడా రాజకీయ రంగేసుకుందని అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇండియాలో ఫేస్‌బుక్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని వెల్లడించింది.

ఫేస్‌బుక్ ఇండియా ఉన్నతాధికారి అంకిత్ దాస్ బీజేపీని తన భుజాలపై మోస్తున్నారని వాల్‌స్ట్రీట్ ప్రచురించింది. బీజేపీ నేతల పేజీల్లో అత్యంత వివాదాస్పద అంశాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నా సరే ఫేస్‌బుక్ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని… బీజేపీకి అనుకూలంగా ఉండడమే ఇందుకు కారణమని ప్రచురించింది. ఇలాంటి వివాదాస్పద పోస్టులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిపై ఉద్యోగులు చర్యలు తీసుకోకుండా అంకిత్ దాస్‌ అడ్డుపడుతున్నారని వెల్లడించింది.

బీజేపీ నేతల పోస్టులపై చర్యలు తీసుకుంటే భారత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటాయని… ఫలితంగా భారత్‌లో ఫేస్‌బుక్ వ్యాపారంపై ప్రభావం పడుతుందంటూ అంకిత్ దాస్ చెబుతున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వివరించింది.

తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉదంతాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా ప్రస్తావించింది. రాజాసింగ్ పేజీలో అత్యంత వివాదాస్పదనమైన, హింసను ప్రేరేపించే పోస్టులున్నా వాటిపై ఫేస్‌బుక్ చర్యలు తీసుకోవడం లేదని… ఇందుకు కారణంగా బీజేపీ పట్ల అంకిత్ దాస్‌కు ఉన్న భయమే కారణమని ప్రచురించింది. కొందరు సంఘ్‌ పరివార్ నేతలు ఇతర మతాలను కించపరిచేలా పోస్టులు పెట్టినా, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసినా వాటిని ఫేస్‌బుక్ తొలగించడం లేదని వివరించింది.

మోడీకి అనుకూల వైఖరిలో ఇవన్నీ భాగంగా జరుగుతున్నాయని ఫేస్‌బుక్ మాజీఅధికారులు చెప్పినట్టు జర్నల్ వివరించింది. దీని వల్ల సంస్థకు చెడ్డపేరు వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల ఖాతాల్లో వివాదస్పద అంశాలు ఉన్నా కేవలం ఫేస్‌బుక్ ఇండియా ఉన్నతాధికారి అంకిత్ దాస్‌ జోక్యం వల్లే ఫేస్‌బుక్ ఉద్యోగులు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వాల్‌స్ట్రీట్ తన సంచలన కథనంలో బయటపెట్టింది.

First Published:  17 Aug 2020 3:17 AM IST
Next Story