ఆరోగ్యశ్రీలోనూ మేసేసిన రమేష్ ఆస్పత్రి
విజయవాడ రమేష్ ఆస్పత్రి ఆగడాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి రమేష్ బాబు అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ ద్వారా రమేష్ ఆస్పత్రి బాగానే వెనుకేసుకున్నట్టు తేలింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా రమేష్ ఆస్పత్రికి చెల్లించినట్టు సమాచారం. టీడీపీ వారి ఆస్పత్రి కావడంతో బిల్లుల చెల్లింపు క్షణాల్లో జరిగిపోయేదని చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్యాకేజీ రేట్ల కంటే భారీగా […]
విజయవాడ రమేష్ ఆస్పత్రి ఆగడాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి రమేష్ బాబు అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ ద్వారా రమేష్ ఆస్పత్రి బాగానే వెనుకేసుకున్నట్టు తేలింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా రమేష్ ఆస్పత్రికి చెల్లించినట్టు సమాచారం.
టీడీపీ వారి ఆస్పత్రి కావడంతో బిల్లుల చెల్లింపు క్షణాల్లో జరిగిపోయేదని చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్యాకేజీ రేట్ల కంటే భారీగా బాధితుల నుంచి వసూలు చేసిందీ ఆస్పత్రి. దీనిపై అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మెటాలిక్ స్టంట్ ధర ఆరోగ్యశ్రీ కింద 45వేలుగా నిర్ణయించగా… ఈ ఆస్పత్రి మాత్రం అదనంగా 50వేల వరకు వసూలు చేసినట్టు తేలింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధిక చెల్లింపులు ఈ రమేష్ ఆస్పత్రికే జరిగాయి. మెకాలి ఆపరేషన్‌కు గుంటూరుకు చెందిన ఒక ఆస్పత్రికి రూ. 1.2 లక్షలు మంజూరు చేసిన బాబు సర్కార్… రమేష్ ఆస్పత్రికి మాత్రం అదే ఆపరేషన్‌కు లక్షా 60వేల చెల్లిస్తూ వచ్చింది. ఇతర ఆస్పత్రుల వారు ఎవరైనా ఈ వివక్షపై ప్రశ్నిస్తే టీడీపీ హయాంలో ఇక వారి ఆస్పత్రులకు బిల్లులే మంజూరు అయ్యేవి కాదు.
టీడీపీ హయాంలో ప్రభుత్వమే తమది అన్నట్టుగా రమేష్ ఆస్పత్రి వ్యవహరించిందని మిగిలిన ఆస్పత్రుల వారు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ హయాంలో ఇలా ఆరోగ్య శ్రీ మాటున భారీగా లబ్ది పొందిన రమేష్ ఆస్పత్రి… వైసీపీ ప్రభుత్వం రాగానే ఆరోగ్య శ్రీ సేవల నుంచి తప్పుకుంది. ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్లు చేస్తే గతంలో తమ చెల్లింపుల వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంటుందన్న భయంతోనే… ఆరోగ్య శ్రీ నుంచి రమేష్ ఆస్పత్రి తప్పుకున్నట్టు చెబుతున్నారు.