Telugu Global
National

పవన్ అభిమాని వైద్యంపై స్పందించిన సీఎం

అనారోగ్యంతో బాధపడుతున్న సిరసపల్లి నాగేంద్ర పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగేంద్ర అనే యువకుడు రక్త సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యానికి లక్షలు అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పవన్‌ కల్యాణ్ అభిమాని అయిన నాగేంద్రకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాతో పిలుపునిచ్చారు. నాగేంద్ర పరిస్థితిని తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి వివరించారు. స్పందించిన సీఎం వెంటనే నాగేంద్రకు వైద్యం అందించేందుకు అన్ని […]

పవన్ అభిమాని వైద్యంపై స్పందించిన సీఎం
X

అనారోగ్యంతో బాధపడుతున్న సిరసపల్లి నాగేంద్ర పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగేంద్ర అనే యువకుడు రక్త సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యానికి లక్షలు అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పవన్‌ కల్యాణ్ అభిమాని అయిన నాగేంద్రకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా సోషల్ మీడియాతో పిలుపునిచ్చారు.

నాగేంద్ర పరిస్థితిని తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి వివరించారు.

స్పందించిన సీఎం వెంటనే నాగేంద్రకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎం సహాయనిధి ఇన్‌చార్జ్ డాక్టర్ హరికృష్ణ బసవతారకం ఆస్పత్రి సిబ్బందితో చర్చించారు. సీఎం సహాయ నిధి నుంచి 10లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. సీఎంవో నుంచి హామీ రావడంతో నాగేంద్రకు స్టెమ్‌ సెల్‌ థెరిపి మొదలుపెట్టారు. నాగేంద్ర పరిస్థితి నిలకడగా ఉందని సీఎం సహాయనిధి ఇన్‌చార్జ్ హరికృష్ణ ప్రకటించారు.

First Published:  16 Aug 2020 6:55 AM IST
Next Story