వరుణ్ తేజ్ హీరోయిన్ మారిపోయింది
ప్రస్తుతం బాక్సింగ్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నారు. సయీ మంజ్రేకర్ స్థానంలో నభా నటేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించారు. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి ఈ […]

ప్రస్తుతం బాక్సింగ్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ మార్పు చోటు చేసుకుంది.
ఈ సినిమాలో మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నారు. సయీ మంజ్రేకర్ స్థానంలో నభా నటేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించారు.
అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి ఈ సినిమాతో పూర్తిస్థాయి ప్రొడ్యూసర్ గా మారుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ విశాఖలో పూర్తిచేశారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి సెట్స్ పైకి వెళ్తారు. ఈ గ్యాప్ లో ఇంట్లోనే ఫుల్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు వరుణ్.