జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ రద్దు గండం
ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో బెయిల్ రాగానే నేరుగా ఇంటికెళ్ళి సేదతీరకుండా మార్గమధ్యలో కారు దిగి సీఐని బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి… ఆ వెంటనే అంతే వేగంగా అరెస్ట్ అయ్యారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆదివారం ఆయన్ను ఈ కేసులో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే సమయంలో ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ షరతులను […]

ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో బెయిల్ రాగానే నేరుగా ఇంటికెళ్ళి సేదతీరకుండా మార్గమధ్యలో కారు దిగి సీఐని బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి… ఆ వెంటనే అంతే వేగంగా అరెస్ట్ అయ్యారు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆదివారం ఆయన్ను ఈ కేసులో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదే సమయంలో ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారని కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజంపై పోలీసులు పూర్తి నివేదికను తయారు చేశారు.