Telugu Global
Health & Life Style

దూరంగా ఉండాలి... దగ్గరై పోరాడాలి!

కోవిడ్ 19 మనకు నేర్పుతున్న పాఠాలు ఎన్నో. మనిషి జీవితం కోవిడ్ 19కి ముందు తరువాత… అనేంత స్థాయిలో మన ఆలోచనలను మార్చేస్తోంది. కలిసిమెలసి దగ్గరగా మీరున్నారా… నేనొచ్చేస్తా.. అనే కరోనాని కలిసికట్టుగా పోరాడి తరిమి కొట్టింది ఓ గ్రామం. ముంబయికి తూర్పున 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం పేరు తలోజా. ఇక్కడ జనాభా సుమారు పదివేలమంది. గ్రామస్తులంతా కలిసి ఒక ఉర్దూ మీడియం స్కూలుని హెల్త్ కేర్ సెంటర్ గా మార్చేసి కరోనా […]

దూరంగా ఉండాలి... దగ్గరై పోరాడాలి!
X

కోవిడ్ 19 మనకు నేర్పుతున్న పాఠాలు ఎన్నో. మనిషి జీవితం కోవిడ్ 19కి ముందు తరువాత… అనేంత స్థాయిలో మన ఆలోచనలను మార్చేస్తోంది. కలిసిమెలసి దగ్గరగా మీరున్నారా… నేనొచ్చేస్తా.. అనే కరోనాని కలిసికట్టుగా పోరాడి తరిమి కొట్టింది ఓ గ్రామం. ముంబయికి తూర్పున 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం పేరు తలోజా. ఇక్కడ జనాభా సుమారు పదివేలమంది. గ్రామస్తులంతా కలిసి ఒక ఉర్దూ మీడియం స్కూలుని హెల్త్ కేర్ సెంటర్ గా మార్చేసి కరోనా పీడకు దూరంగా సురక్షితంగా ఉంటున్నారు.

మొహమ్మద్ యాసిన్ పటేల్ అనే వ్యక్తికి ఈ ఆలోచన వచ్చింది. జూన్ నెలలో ఆ గ్రామంలో మూడు కోవిడ్ 19 కేసులు కనిపించాయి. అందులో ఒకరు మరణించారు. దాంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు. ఏ కాస్త లక్షణాలు కనిపించినా ఆ వ్యక్తిని అనుమానంగా చూడటం, దూరంగా పెట్టటం, లక్షణాలు కనిపించిన వారు విపరీతంగా ఆందోళన చెందటం ఇవన్నీ చూశాక మొహమ్మద్ యాసిన్ పటేల్ కి ఈ ఆలోచన వచ్చింది.

కరోనాని నివారించాలన్నా, దాన్ని తరిమికొట్టాలన్నా… స్థానికంగా అదే ధ్యేయంతో పనిచేసే హాస్పటల్ అవసరం ఉందని భావించాడు పటేల్. గ్రామస్తులకు చెప్పగా వారు కూడా అవునన్నారు. గ్రామంలోని కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి… తమ ఊళ్లోని ఉర్దూమీడియం స్కూలుని తాత్కాలికంగా హాస్పటల్ గా మార్చుకునేందుకు అనుమతి కావాలని పాన్ వెల్ మున్సిపల్ కార్పొరేషన్ ని కోరారు. స్కూళ్లు మూసే ఉండటంతో కార్పొరేషన్ వెంటనే అనుమతి ఇచ్చింది. ఊళ్లోని పెద్దమనుషులను కలిసి తమ నిర్ణయం చెప్పారు. దాంతో హాస్పటల్ ఏర్పాటుకి తలా ఒక చెయ్యి వేశారు. ఒక్కరోజులో నాలుగు లక్షల రూపాయలు పోగయ్యాయి. వెంటనే హాస్పటల్ కి అవసరమైన సామగ్రిని తెచ్చి స్కూలుని హెల్త్ కేర్ సెంటర్ గా మార్చేశారు. స్థానికంగా ఉన్న వైద్యులు ఇక్కడ చికిత్సని అందిస్తున్నారు.

కరోనా లక్షణాల్లా కనిపించే ఇతర సమస్యలన్నింటికీ వెంటనే 24 గంటలలోపే చికిత్స అందుతుండటంతో జూన్ నుండి గ్రామంలో ఒక్క కోవిడ్ కేస్ కూడా నమోదు కాలేదు. రోజుకి వందమంది పేషంట్లు ఈ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ఫీజు కింద వంద రూపాయలు తీసుకుంటున్నారు. జనరిక్ మెడిసిన్స్ ని వాడమని వైద్యులు చెబుతున్నారు. తక్కువ ఫీజు, మంచి వైద్య సదుపాయాలు ఉండటంతో ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలనుండి కూడా ప్రజలు ఈ హాస్పటల్ కి వస్తున్నారు.

First Published:  16 Aug 2020 9:04 AM IST
Next Story