పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
పవన్ కల్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలో నటించిన అనీషా ఆంబ్రోస్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనీషా బెస్ట్ ఫ్రెండ్ తేజశ్వి మడివాడ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడామె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా తేజశ్వినే బయటపెట్టింది. అనీషా-గుణ దంపతులకు పండంటి బాబు పుట్టాడు. కొడుక్కి జడెన్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు ఈ దంపతులు. ఆ పేరుతోనే బాబు […]

పవన్ కల్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలో నటించిన అనీషా ఆంబ్రోస్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అనీషా బెస్ట్ ఫ్రెండ్ తేజశ్వి మడివాడ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడామె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా తేజశ్వినే బయటపెట్టింది.
అనీషా-గుణ దంపతులకు పండంటి బాబు పుట్టాడు. కొడుక్కి జడెన్ అనే పేరు కూడా ఫిక్స్ చేశారు ఈ దంపతులు. ఆ పేరుతోనే బాబు ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
బాబు కోసం రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా ఎదురుచూశానంటోంది అనీషా. ఎట్టకేలకు బాబును తన చేతులతో తాకినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటోంది.
ఇక్కడే మరో యాధృచ్ఛిక ఘటనను కూడా వెల్లడించింది అనీషా. సరిగ్గా మూడేళ్ల కిందట ఏ రోజైతే తను గుణను కలిసిందో, ఇప్పుడు అదే రోజున బాబుకు జన్మనిచ్చిందట.