Telugu Global
National

బాబాయి రమేష్‌కు సపోర్టుగా జగన్‌కు నటుడు రామ్ సలహా

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్ని ప్రమాదం వ్యవహారంలో రమేష్ హాస్పటల్‌ యజమాని రమేష్ బాబు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఒక ఆడియో టేపును ఒక చానల్‌కు ఆయన పంపించారు. హోటల్ యాజమాన్యంపై కాకుండా రమేష్ ఆస్పత్రి సిబ్బందిని టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. పరారీలో రమేష్ హాస్పటల్ అధినేత అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ డాక్టర్లను పోలీసులు నిర్బంధించారని తెలియగానే తమ లాయర్ల సూచన మేరకు సెల్‌ఫోన్ స్విచ్చాప్‌ చేశానని చెప్పారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం […]

బాబాయి రమేష్‌కు సపోర్టుగా జగన్‌కు నటుడు రామ్ సలహా
X

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో అగ్ని ప్రమాదం వ్యవహారంలో రమేష్ హాస్పటల్‌ యజమాని రమేష్ బాబు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఒక ఆడియో టేపును ఒక చానల్‌కు ఆయన పంపించారు. హోటల్ యాజమాన్యంపై కాకుండా రమేష్ ఆస్పత్రి సిబ్బందిని టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. పరారీలో రమేష్ హాస్పటల్ అధినేత అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తమ డాక్టర్లను పోలీసులు నిర్బంధించారని తెలియగానే తమ లాయర్ల సూచన మేరకు సెల్‌ఫోన్ స్విచ్చాప్‌ చేశానని చెప్పారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు.

కరోనా చికిత్స విషయంలో ప్రతి చోట నిబంధనలను ఉల్లంఘించారని జాయింట్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దాంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా ఆస్పత్రికి ఇచ్చిన గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది.

ఇది కొనసాగుతుండగానే నటుడు రామ్ రంగ ప్రవేశం చేశాడు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి ట్వీట్ ద్వారా సలహా ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు సోదరుడి కుమారుడే ఈ హీరో రాము.

‘‘హోటల్ స్వర్ణ ప్యాలస్‌ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?’’ అని ప్రశ్నించాడు.

అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

రమేష్ ఆస్పత్రికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని రామ్ ట్వీట్ చేశాడు. మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్టతో పాటు… మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది… ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నామని … ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి రామ్ ట్వీట్ చేశాడు. తన బాబాయి కావడంతో రమేష్ బాబుకు అండగా రామ్ రంగప్రవేశం చేశాడు.

First Published:  15 Aug 2020 2:36 PM IST
Next Story