కీర్తిసురేష్ అల్లరి చూడండి
కీర్తిసురేష్ లో చిలిపితనం తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. మహానటిలో ఆమె అల్లరిని అంతా చూశారు. ఇప్పుడు దాదాపు అదే అల్లరిని తన కొత్త సినిమాలో చూపిస్తోంది కీర్తిసురేష్. ఈమె నటించిన గుడ్ లక్ సఖి సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో పల్లెటూరి అమ్మాయిగా, అల్లరి పిల్లగా కనిపించింది కీర్తి. అదే ఊరిలో నాటకాలు వేసుకునే రామారావు పాత్రలో ఆది పినిశెట్టి, కోచ్ పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్నారు. టీజర్ కు దేవిశ్రీప్రసాద్ […]

కీర్తిసురేష్ లో చిలిపితనం తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. మహానటిలో ఆమె అల్లరిని అంతా చూశారు. ఇప్పుడు దాదాపు అదే అల్లరిని తన కొత్త సినిమాలో చూపిస్తోంది కీర్తిసురేష్. ఈమె నటించిన గుడ్ లక్ సఖి సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో పల్లెటూరి అమ్మాయిగా, అల్లరి పిల్లగా కనిపించింది కీర్తి.
అదే ఊరిలో నాటకాలు వేసుకునే రామారావు పాత్రలో ఆది పినిశెట్టి, కోచ్ పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్నారు. టీజర్ కు దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఊరిలో అందరితో బ్యాడ్ లక్ సఖి అనిపించుకున్న హీరోయిన్, రైఫిల్ షూటింగ్ లో ఎలా రాణించింది.. తన ఊరికి దేశానికి ఎలా పేరుతెచ్చిపెట్టిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
దిల్‌రాజు సమర్పణలో వర్త్ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న గుడ్ లక్ సఖి చిత్రానికి సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Sakhi has arrived! ❤️
Here comes the teaser for ̷B̷a̷d̷ Good Luck Sakhi ! ❤️?
Wishing you all a very #HappyIndependenceDay! ??
Tamil – https://t.co/qMMmIyF9Kt
Malayalam – https://t.co/H6elVuMTm3
Telugu – https://t.co/oBoCRceIda#GoodLuckSakhi #GoodLuckSakhiTeaser
— Keerthy Suresh (@KeerthyOfficial) August 15, 2020